వేసాలెల్లాఁ జేసేవు వింతవానివలెనే
(॥పల్లవి॥)
వేసాలెల్లాఁ జేసేవు వింతవానివలెనే
పాసికూడి వలపించ పంతమా నాకు
(॥వేసా॥)
వూని చెలులచేత నన్నొడంబరపించేవు
ఔనయ్య నీమాటకు నే నడ్డమాడేనా
అనుకొని సొమ్ములు నా కంతలోనే వొసగేవు
కానీవయ్యా నే నాసోదకత్తెనా ఇపుడు
(॥వేసా॥)
వరుసతో నూరకైనా వావులు నన్నడిగేవు
వొరసి నీ వంటఁగా నే నోపననేనా
గరిమతో వీడెమిచ్చి కడు నుబ్బు రేఁచేవు
తరితీపుతోడి విదరవెల్లిదాననా
(॥వేసా॥)
అదరిపాటున వచ్చి అట్టె కాఁగిటఁ గూడేవు
యెదుట నన్నేలంగా నిన్నెలయించేనా
అదన శ్రీవేంకటేశ అలమేల్ మంగనే నేను
పదరి నీతో నేను పాసివుండంగలనా
(||pallavi||)
vesālĕllām̐ jesevu viṁtavānivalĕne
pāsigūḍi valabiṁcha paṁtamā nāgu
(||vesā||)
vūni sĕlulaseda nannŏḍaṁbarabiṁchevu
aunayya nīmāḍagu ne naḍḍamāḍenā
anugŏni sŏmmulu nā kaṁtalone vŏsagevu
kānīvayyā ne nāsodagattĕnā ibuḍu
(||vesā||)
varusado nūragainā vāvulu nannaḍigevu
vŏrasi nī vaṁṭam̐gā ne nobananenā
garimado vīḍĕmichchi kaḍu nubbu rem̐sevu
taridībudoḍi vidaravĕllidānanā
(||vesā||)
adaribāḍuna vachchi aṭṭĕ kām̐giḍam̐ gūḍevu
yĕduḍa nannelaṁgā ninnĕlayiṁchenā
adana śhrīveṁkaḍeśha alamel maṁgane nenu
padari nīdo nenu pāsivuṁḍaṁgalanā