వేసాలవాఁడు గదవే విట్ఠలేశుఁడు
(॥పల్లవి॥)
వేసాలవాఁడు గదవే విట్ఠలేశుఁడు
తా వేసారఁ డెందుకు నైనా విట్ఠలేశుఁడు
(॥వేసాల॥)
వేడుకకాఁడు గదవే విట్ఠలేశుఁడు నాకు
వీడె మిచ్చీ నింతనోనె విట్ఠలేశుఁడు
వీడ నాడనీఁడు నన్ను విట్ఠలేశుఁడు అట్టె
వేడెవట్టీ వలపులు విట్ఠలేశుఁడు
(॥వేసాల॥)
వెన్నెలనవ్వులు నవ్వీ విట్ఠలేశుఁడు యాడో
విన్నపము లాలకించీ విట్ఠలేశుఁడు
వెన్నముచ్టిమి విద్యల విట్ఠలేశుఁడు నా
విన్నఁదన మెల్లా బాపీ విట్ఠలేశుఁడు
(॥వేసాల॥)
విరులు నాపైఁ జల్లీ విట్ఠలేశుఁడు కడు
విరివికాఁడు గదవే విట్ఠలేశుఁడు
ఆరిది శ్రీవెంకటాద్రి నందు నిందు నన్నుఁ గూడె
వెరవరి గదవె యీ విట్ఠలేశుఁడూ
(||pallavi||)
vesālavām̐ḍu gadave viṭṭhaleśhum̐ḍu
tā vesāram̐ ḍĕṁdugu nainā viṭṭhaleśhum̐ḍu
(||vesāla||)
veḍugagām̐ḍu gadave viṭṭhaleśhum̐ḍu nāgu
vīḍĕ michchī niṁtanonĕ viṭṭhaleśhum̐ḍu
vīḍa nāḍanīm̐ḍu nannu viṭṭhaleśhum̐ḍu aṭṭĕ
veḍĕvaṭṭī valabulu viṭṭhaleśhum̐ḍu
(||vesāla||)
vĕnnĕlanavvulu navvī viṭṭhaleśhum̐ḍu yāḍo
vinnabamu lālagiṁchī viṭṭhaleśhum̐ḍu
vĕnnamuchṭimi vidyala viṭṭhaleśhum̐ḍu nā
vinnam̐dana mĕllā bābī viṭṭhaleśhum̐ḍu
(||vesāla||)
virulu nābaim̐ jallī viṭṭhaleśhum̐ḍu kaḍu
virivigām̐ḍu gadave viṭṭhaleśhum̐ḍu
āridi śhrīvĕṁkaḍādri naṁdu niṁdu nannum̐ gūḍĕ
vĕravari gadavĕ yī viṭṭhaleśhum̐ḍū