Vesaalagu mammu nela vemdugonevu

వేసాలకు మమ్ము నేల వేఁడుకొనేవు
Language

(॥పల్లవి॥)
వేసాలకు మమ్ము నేల వేఁడుకొనేవు
నీ సొమ్మై యెవ్వరున్నా నీకు మేలుగాదా

(॥వేసా॥)
అంగన నొడఁబరచి అందలానఁ బెట్టుకొని
సంగతిగాఁ దెచ్చుకొంటి జాణతనాన
జంగిలిసతు లెంతవేసరించకుండినా నీకు
అంగవించి సుకిసతువు అదిమేలు గాదా

(॥వేసా॥)
మెల మాడుతా నాపెను మేడమీఁదఁ బెట్టుకొని
తాలిమి నిల్లు వెళ్లవు దంటతనాన
ఆలరి నీ సతు లెంత అలిగి రాకుండినాను
యీలీల నీయిచ్చనందు విదె మేలు గాదా

(॥వేసా॥)
పచ్చిగా నాపెఁ గూడి పానుపుపై నవ్వుకొంటా
చెచ్చెర నప్పటి నాచేయి వట్టేవు
యిచ్చకానకు శ్రీ వేంకటేశ నన్నుఁగూడితివి
మచ్చికసతులమూఁక మరి మేలు గాదా

(||pallavi||)
vesālagu mammu nela vem̐ḍugŏnevu
nī sŏmmai yĕvvarunnā nīgu melugādā

(||vesā||)
aṁgana nŏḍam̐barasi aṁdalānam̐ bĕṭṭugŏni
saṁgadigām̐ dĕchchugŏṁṭi jāṇadanāna
jaṁgilisadu lĕṁtavesariṁchaguṁḍinā nīgu
aṁgaviṁchi sugisaduvu adimelu gādā

(||vesā||)
mĕla māḍudā nābĕnu meḍamīm̐dam̐ bĕṭṭugŏni
tālimi nillu vĕḽlavu daṁṭadanāna
ālari nī sadu lĕṁta aligi rāguṁḍinānu
yīlīla nīyichchanaṁdu vidĕ melu gādā

(||vesā||)
pachchigā nābĕm̐ gūḍi pānububai navvugŏṁṭā
sĕchchĕra nappaḍi nāseyi vaṭṭevu
yichchagānagu śhrī veṁkaḍeśha nannum̐gūḍidivi
machchigasadulamūm̐ka mari melu gādā