వేసాల నేఁడు నాకుఁగా వెరవ నేల
(॥పల్లవి॥)
వేసాల నేఁడు నాకుఁగా వెరవ నేల
వాసి యాపె కెక్కించఁగా వద్దనేనా యిపుడు
(॥వేసాల॥)
చాయలు చూచి చూచి సణఁగులు చల్లి చల్లి
ఆయెడనే నిలుచున్న దప్పటనుండి
చేయి మీఁది వేసి యాపె జెంగటఁ గూచుండు మంటే
యీయెడఁ దా వచ్చినా నే లనేనా నేను
(॥వేసాల॥)
వెంగెములే యాడి యాడి వెరగులే నించి నించి
కంగి నిలుచున్న దదే కంబముదండ
సంగడి నీవు నిలిచి చన విచ్చి వేఁడుకొంటే
సింగారము నేఁడు గాదా సిగ్గయ్యినా నీకు
(॥వేసాల॥)
పొందు లట్టె చేసి చేసి బొమ్మలట్టే వంచి వంచి
కందువ శ్రీవెంకటేశ కరఁగీ నదే
యిందు నందుఁ దిరిగాడి యిద్దరిఁ గూడితి విట్టే
ముందరనే యిట్టైతే మొరఁగి నవ్వేనా
(||pallavi||)
vesāla nem̐ḍu nāgum̐gā vĕrava nela
vāsi yābĕ kĕkkiṁcham̐gā vaddanenā yibuḍu
(||vesāla||)
sāyalu sūsi sūsi saṇam̐gulu salli salli
āyĕḍane nilusunna dappaḍanuṁḍi
seyi mīm̐di vesi yābĕ jĕṁgaḍam̐ gūsuṁḍu maṁṭe
yīyĕḍam̐ dā vachchinā ne lanenā nenu
(||vesāla||)
vĕṁgĕmule yāḍi yāḍi vĕragule niṁchi niṁchi
kaṁgi nilusunna dade kaṁbamudaṁḍa
saṁgaḍi nīvu nilisi sana vichchi vem̐ḍugŏṁṭe
siṁgāramu nem̐ḍu gādā siggayyinā nīgu
(||vesāla||)
pŏṁdu laṭṭĕ sesi sesi bŏmmalaṭṭe vaṁchi vaṁchi
kaṁduva śhrīvĕṁkaḍeśha karam̐gī nade
yiṁdu naṁdum̐ dirigāḍi yiddarim̐ gūḍidi viṭṭe
muṁdarane yiṭṭaide mŏram̐gi navvenā