వెస నిటమీఁది మాట విచారించవయ్యా నీవే
(॥పల్లవి॥)
వెస నిటమీఁది మాట విచారించవయ్యా నీవే
వుసురని తనలోనే వొగిఁ దల వూఁచెను
(॥వెస॥)
అలిగి పోయిపోయి అతివ నీమోము చూచి
బలిమిఁ జల్లగా నిన్ను బతుకు మనె
యెలమిఁ గసరుకొని యేమి విచారించుకొనో
చెలరేఁగి చెలరేఁగి చేతులెత్తి మొక్కెను
(॥వెస॥)
వొట్టు వెట్టుకొని వుండి వువిద తెగువతోని-
న్నుట్టిపడి చెలులకు నొప్పగించెను
పట్టకు నన్నని తిట్టి భావించి చూచుకొని
అట్టె నిన్నిపుడె పెండ్లాడు మనెను
(॥వెస॥)
సారె నిన్ను నేరమెంచి చలము గొబ్బన మాని
గారవించి నిన్నింతలోఁ గాఁగిలించెను
కూరిమి శ్రీవేంకటేశ కూడి నీపానుపుమీఁద
నేరుపుతోఁ బవళించి నిన్నుఁజూచి మెచ్చెను
(||pallavi||)
vĕsa niḍamīm̐di māḍa visāriṁchavayyā nīve
vusurani tanalone vŏgim̐ dala vūm̐sĕnu
(||vĕsa||)
aligi poyiboyi adiva nīmomu sūsi
balimim̐ jallagā ninnu badugu manĕ
yĕlamim̐ gasarugŏni yemi visāriṁchugŏno
sĕlarem̐gi sĕlarem̐gi sedulĕtti mŏkkĕnu
(||vĕsa||)
vŏṭṭu vĕṭṭugŏni vuṁḍi vuvida tĕguvadoni-
nnuṭṭibaḍi sĕlulagu nŏppagiṁchĕnu
paṭṭagu nannani tiṭṭi bhāviṁchi sūsugŏni
aṭṭĕ ninnibuḍĕ pĕṁḍlāḍu manĕnu
(||vĕsa||)
sārĕ ninnu neramĕṁchi salamu gŏbbana māni
gāraviṁchi ninniṁtalom̐ gām̐giliṁchĕnu
kūrimi śhrīveṁkaḍeśha kūḍi nībānubumīm̐da
nerubudom̐ bavaḽiṁchi ninnum̐jūsi mĕchchĕnu