వేరొక్కరూ లేరు విశ్వ మింతా నీ మహిమే
(॥పల్లవి॥)
వేరొక్కరూ లేరు విశ్వ మింతా నీ మహిమే
యే రీతి నీవే కలవు యితరములేదు
(॥వేరొ॥)
తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు
యిల్లాలివై మోహమిత్తువు నాకు
వొళ్లై పెరుగుదువు వొగిఁ బురాకృత మౌదు
యిల్లు ముంగిలై వుందువింతా నీ మహిమే
(॥వేరొ॥)
గురుఁడవై బోధింతువు కొడుకవై యీడేర్తువు
అరుదై నిధానము వౌదు నీవే
దొరవై నన్నేలుదువు దూతవై పని సేతువు
యిరవైన సిరు లిత్తు వింతా నీ మహిమే
(॥వేరొ॥)
దేవుఁడవై పూజ గొందు దిక్కు ప్రాణ మౌదువు
కావలసిన ట్టౌదు కామించినట్లు
శ్రీ వేంకటేశ నీవే చిత్తములోపల నుండి
యీవల వైకుంఠ మిత్తు వింతా నీమహిమే
(||pallavi||)
verŏkkarū leru viśhva miṁtā nī mahime
ye rīdi nīve kalavu yidaramuledu
(||verŏ||)
tallivai rakṣhiṁtuvu taṁḍrivai poṣhiṁtuvu
yillālivai mohamittuvu nāgu
vŏḽlai pĕruguduvu vŏgim̐ burākṛta maudu
yillu muṁgilai vuṁduviṁtā nī mahime
(||verŏ||)
gurum̐ḍavai bodhiṁtuvu kŏḍugavai yīḍerduvu
arudai nidhānamu vaudu nīve
dŏravai nanneluduvu dūdavai pani seduvu
yiravaina siru littu viṁtā nī mahime
(||verŏ||)
devum̐ḍavai pūja gŏṁdu dikku prāṇa mauduvu
kāvalasina ṭṭaudu kāmiṁchinaṭlu
śhrī veṁkaḍeśha nīve sittamulobala nuṁḍi
yīvala vaiguṁṭha mittu viṁtā nīmahime