Veṟogadim gaadu summee velamdi neegu meludi

వేఱొకటిఁ గాదు సుమ్మీ వెలఁది నీకు మేలుది
Language

(॥పల్లవి॥)
వేఱొకటిఁ గాదు సుమ్మీ వెలఁది నీకు మేలుది
మీఱిన సంతోసాన మిక్కిలి మన్నించుమీ

(॥వేఱొ॥)
కన్నుల సొలయుఁగాని కడవ మాఁటాడదు
చన్నుల నొరయుఁగాని జంకించదు
సన్నలఁ గొసరుఁగాని చలము సాదించదు
ఇన్నిటాఁ జెలికి నీపై నెటువంటి ప్రియమో

(॥వేఱొ॥)
బలిమిఁ బెనఁగుఁగాని పంతములు నెరపదు
మలసి చెనకుఁగాని మచ్చరించదు
అలరుల వేయుఁగాని ఆస నీపై వదలదు
యెలమి నీపెకు నీపై నెలువంటి ప్రియమో

(॥వేఱొ॥)
చుట్టి నీతో నవ్వుఁగాని చూపదు యెగసక్యాలు
గుట్టుతోడ నుండుఁగాని గుంపించదు
నెట్టన శ్రీవేంకటేశ నెలఁతనుఁ గూడితివి
యిట్టె మెచ్చీ నీపైఁ దన కెటువంటి ప్రియమో

(||pallavi||)
veṟŏgaḍim̐ gādu summī vĕlam̐di nīgu meludi
mīṟina saṁtosāna mikkili manniṁchumī

(||veṟŏ||)
kannula sŏlayum̐gāni kaḍava mām̐ṭāḍadu
sannula nŏrayum̐gāni jaṁkiṁchadu
sannalam̐ gŏsarum̐gāni salamu sādiṁchadu
inniḍām̐ jĕligi nībai nĕḍuvaṁṭi priyamo

(||veṟŏ||)
balimim̐ bĕnam̐gum̐gāni paṁtamulu nĕrabadu
malasi sĕnagum̐gāni machchariṁchadu
alarula veyum̐gāni āsa nībai vadaladu
yĕlami nībĕgu nībai nĕluvaṁṭi priyamo

(||veṟŏ||)
suṭṭi nīdo navvum̐gāni sūbadu yĕgasakyālu
guṭṭudoḍa nuṁḍum̐gāni guṁpiṁchadu
nĕṭṭana śhrīveṁkaḍeśha nĕlam̐tanum̐ gūḍidivi
yiṭṭĕ mĕchchī nībaim̐ dana kĕḍuvaṁṭi priyamo