వేఱొక యాఁటదైతే వేసరు నీ పొందులకు
(॥పల్లవి॥)
వేఱొక యాఁటదైతే వేసరు నీ పొందులకు
ఆఱడి కోర్తువు నీవు ఆసోద మెట్టిదో
(॥వేఱొ॥)
చనపుచేసుక నిన్నుచన్నులనే నవొత్తితి
మనసురానవ్వునవ్వి మర్మమంటితి
పెనఁగి రతులనే బెండుపడఁ జేసితి
తనియ వెంతైన నీతమకమదెట్టిదో
(॥వేఱొ॥)
పెదవితేనె లాని పిప్పిసేసితి నీమోవి
పదరి పచ్చిమాఁటల భ్రమయించితి
గుదికొన్నచూపులనేకొచ్చికొచ్చి చొక్కించితి
మదము దిగవునీమగతను మెట్టిదో
(॥వేఱొ॥)
వూడిగాలు చేసిచేసి వొడలెల్లానిమిరితి
వాడికకూటములను వలపించితి
యీడనె శ్రీవేంకటేశ యిఁత నిన్నుఁ గొసరితి
వోడ నెఁ(వెం?) తయినానీవోపికింకా నెట్టిదో
(||pallavi||)
veṟŏga yām̐ṭadaide vesaru nī pŏṁdulagu
āṟaḍi korduvu nīvu āsoda mĕṭṭido
(||veṟŏ||)
sanabusesuga ninnusannulane navŏttidi
manasurānavvunavvi marmamaṁṭidi
pĕnam̐gi radulane bĕṁḍubaḍam̐ jesidi
taniya vĕṁtaina nīdamagamadĕṭṭido
(||veṟŏ||)
pĕdavidenĕ lāni pippisesidi nīmovi
padari pachchimām̐ṭala bhramayiṁchidi
gudigŏnnasūbulanegŏchchigŏchchi sŏkkiṁchidi
madamu digavunīmagadanu mĕṭṭido
(||veṟŏ||)
vūḍigālu sesisesi vŏḍalĕllānimiridi
vāḍigagūḍamulanu valabiṁchidi
yīḍanĕ śhrīveṁkaḍeśha yim̐ta ninnum̐ gŏsaridi
voḍa nĕm̐(vĕṁ?) tayinānīvobigiṁkā nĕṭṭido