వేఱొక భావనలేల వీనితోఁ బెనఁగనేల
(॥పల్లవి॥)
వేఱొక భావనలేల వీనితోఁ బెనఁగనేల
తూఱినందే హరిఁ గూర్చి తుదగంట గాక
(॥వేఱొ॥)
చూచే కన్నుల నేమిఁ జూడకుండవచ్చునా
చూచినందెల్లా హరిఁ జూచుట గాక
వేచిన వీనుల నేమీ వినకుండవచ్చునా
కాచి యవే హరికథగా వింట గాక
(॥వేఱొ॥)
కోరేటి చవుల జిహ్వ గోరకుండవచ్చునా
కోరిన చవుల హరిఁ గూర్చుట గాక
ఆరీతి బారే మనసు అడఁచఁగవచ్చునా
ఆరితేరి అన్నిటాను హరిఁ గంట గాక
(॥వేఱొ॥)
వొడలు మోచిన దేహి వోమకుండవచ్చునా
వోడలు శ్రీహరిదనే వోముట గాక
బడినే శ్రీవేంకటేశుఁ బాసివుండవచ్చునా
యెడయ కందె సుఖియించుట గాక
(||pallavi||)
veṟŏga bhāvanalela vīnidom̐ bĕnam̐ganela
tūṟinaṁde harim̐ gūrsi tudagaṁṭa gāga
(||veṟŏ||)
sūse kannula nemim̐ jūḍaguṁḍavachchunā
sūsinaṁdĕllā harim̐ jūsuḍa gāga
vesina vīnula nemī vinaguṁḍavachchunā
kāsi yave harigathagā viṁṭa gāga
(||veṟŏ||)
koreḍi savula jihva goraguṁḍavachchunā
korina savula harim̐ gūrsuḍa gāga
ārīdi bāre manasu aḍam̐sam̐gavachchunā
ārideri anniḍānu harim̐ gaṁṭa gāga
(||veṟŏ||)
vŏḍalu mosina dehi vomaguṁḍavachchunā
voḍalu śhrīharidane vomuḍa gāga
baḍine śhrīveṁkaḍeśhum̐ bāsivuṁḍavachchunā
yĕḍaya kaṁdĕ sukhiyiṁchuḍa gāga