వేరేపొందు వలెనా వింతవారితో
(॥పల్లవి॥)
వేరేపొందు వలెనా వింతవారితో
ఆరితేరితే మనసు అలవాటువడును
(॥వేరే॥)
మక్కళించి మక్కళించి మాటలట్టె ఆడితేను
చిక్కి నీవలపులకు చేవలెక్కును
యెక్క డెక్కడ నైనాను యెదురుకట్లనుంటే
జవ్వన ముబ్బి దైలువారును
(॥వేరే॥)
తగిలితగిలి మోము తప్పకచూచితేను
అగపడ్డరతులకు ఆస వుట్టును
నగినగి పలుమారు ననుపులు సేసితేను
జిగి మర్మాలు గరఁగి చిమ్మిరేఁగును
(॥వేరే॥)
చెలరేఁగిచెలరేఁగి చెనకదొరకొంటేను
ములువాఁడి కొనగోళ్ళముద్ర లంటును
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పలుకుఁబంతము లిఁకఁ బచ్చిదేరును
(||pallavi||)
verebŏṁdu valĕnā viṁtavārido
ārideride manasu alavāḍuvaḍunu
(||vere||)
makkaḽiṁchi makkaḽiṁchi māḍalaṭṭĕ āḍidenu
sikki nīvalabulagu sevalĕkkunu
yĕkka ḍĕkkaḍa nainānu yĕdurugaṭlanuṁṭe
javvana mubbi dailuvārunu
(||vere||)
tagilidagili momu tappagasūsidenu
agabaḍḍaradulagu āsa vuṭṭunu
naginagi palumāru nanubulu sesidenu
jigi marmālu garam̐gi simmirem̐gunu
(||vere||)
sĕlarem̐gisĕlarem̐gi sĕnagadŏragŏṁṭenu
muluvām̐ḍi kŏnagoḽḽamudra laṁṭunu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
palugum̐baṁtamu lim̐kam̐ bachchiderunu