వేరె యిఁక నంతేసి విచ్చి చెప్పవలెనా
(॥పల్లవి॥)
వేరె యిఁక నంతేసి విచ్చి చెప్పవలెనా
సారెకు నవ్వినదే పచారించుటే కాదా
(॥వేరె॥)
అంచెల నెదుటనున్న ఆఁటదానితో మాఁటలు
పొంచి యాడకుండితేను పొమ్మంట గాదా
కంచముపొత్తున నుండే కలికిఁ బిలువక తా
ముంచి కడెత్తితే నన్నియు ముగించుటగాదా
(॥వేరె॥)
మేర మీరి చనవరి మెలుఁతఁ దప్పక చూచి
ధీరత నెదురాడితేఁ దిట్టుట గాదా
చేరువనుండి అట్టె చెనకఁగ గుట్టుతోడ
వూరక వుండినదెల్ల వొల్లనంట గాదా
(॥వేరె॥)
తక్కక కానుక లిచ్చి తరుణిఁ జూడక వుంటే
చిక్కిం చాపె వెల్లవిరి సేయుటేకాదా
యెక్కువ శ్రీవేంకటేశ యిట్టె మాచెలిఁ గూడితిఁ
వొక్కమనసై నందుకు వుంకువిదే కాదా
(||pallavi||)
verĕ yim̐ka naṁtesi vichchi sĕppavalĕnā
sārĕgu navvinade pasāriṁchuḍe kādā
(||verĕ||)
aṁchĕla nĕduḍanunna ām̐ṭadānido mām̐ṭalu
pŏṁchi yāḍaguṁḍidenu pŏmmaṁṭa gādā
kaṁchamubŏttuna nuṁḍe kaligim̐ biluvaga tā
muṁchi kaḍĕttide nanniyu mugiṁchuḍagādā
(||verĕ||)
mera mīri sanavari mĕlum̐tam̐ dappaga sūsi
dhīrada nĕdurāḍidem̐ diṭṭuḍa gādā
seruvanuṁḍi aṭṭĕ sĕnagam̐ga guṭṭudoḍa
vūraga vuṁḍinadĕlla vŏllanaṁṭa gādā
(||verĕ||)
takkaga kānuga lichchi taruṇim̐ jūḍaga vuṁṭe
sikkiṁ sābĕ vĕllaviri seyuḍegādā
yĕkkuva śhrīveṁkaḍeśha yiṭṭĕ māsĕlim̐ gūḍidim̐
vŏkkamanasai naṁdugu vuṁkuvide kādā