Vere ninnum baasinatti virahame yaramgadu

వేరే నిన్నుఁ బాసినట్టి విరహమే యరఁగదు
Language

(॥పల్లవి॥)
వేరే నిన్నుఁ బాసినట్టి విరహమే యరఁగదు
ఆ రీతిఁ గూడి వుందాననంటానే వున్నది

(॥॥)
తలఁపులో నీరూపు తలపోసి మదిరాక్షి
సొలసి మాఁటలాడి చొక్కచు నుండు
వలపు లూరకే చల్లు వాడికలు చేకొని
వులివచ్చిరతులలో నోలలాడును

(॥॥)
నెట్టనఁ జేతిబాగాలు నీకు సమర్పణ చేసి
అట్టె తంమ్ములమ్ము నిన్నుడుగుచుండు
గట్టిగా నీవిచ్చిన వుంగరము చన్నులంటించి
తొట్టుకొన్నయట్టిసిగ్గుతోడఁ గడునవ్వును

(॥॥)
పైపై నీభావచిత్రపలక కాఁగిటఁ జేర్చి
దీపించు వేడుకతో తెరవేసును
యేపున శ్రీ వేంకటేశ యింతలో నీవు గూడఁగా
వోపికతోనాఁడు నేఁడు నొక్కరీతిం నుంన్నది

(||pallavi||)
vere ninnum̐ bāsinaṭṭi virahame yaram̐gadu
ā rīdim̐ gūḍi vuṁdānanaṁṭāne vunnadi

(||||)
talam̐pulo nīrūbu talabosi madirākṣhi
sŏlasi mām̐ṭalāḍi sŏkkasu nuṁḍu
valabu lūrage sallu vāḍigalu segŏni
vulivachchiradulalo nolalāḍunu

(||||)
nĕṭṭanam̐ jedibāgālu nīgu samarbaṇa sesi
aṭṭĕ taṁmmulammu ninnuḍugusuṁḍu
gaṭṭigā nīvichchina vuṁgaramu sannulaṁṭiṁchi
tŏṭṭugŏnnayaṭṭisiggudoḍam̐ gaḍunavvunu

(||||)
paibai nībhāvasitrabalaga kām̐giḍam̐ jersi
dībiṁchu veḍugado tĕravesunu
yebuna śhrī veṁkaḍeśha yiṁtalo nīvu gūḍam̐gā
vobigadonām̐ḍu nem̐ḍu nŏkkarīdiṁ nuṁnnadi