వేరె నే నేమి సేసినా వెంగె మయ్యీని
(॥పల్లవి॥)
వేరె నే నేమి సేసినా వెంగె మయ్యీని
పోరచి పొరుగు మీరే బుద్ది చెప్పరమ్మా
(॥వేరె॥)
దగ్గరి తనతో నేను తగుల నాడితి నని
సిగ్గువడి వున్నవాఁడు చెక్కుచేతితో
అగ్గలమై నే మొక్కితే నంతకంటెఁ దలవంచీ
వెగ్గళమై మీరైనా వేఁడుకోరే చెలులు
(॥వేరె॥)
ఆరసి యెం దుటి వని యడిగినమాత్రమున
మోర పంచు కున్నాఁడు మౌనముతోడ
సారె నే బుజ్జగించితే రి నెంతైనా నమ్మఁడు
ఆరితేరి నామారు మీ రానవెట్టుకొనరే
(॥వేరె॥)
గక్కన నేఁ దనుఁ జూచి కాఁగిలించుకొన్నందుకు
మక్కువతో నన్నుమెచ్చీ మాటిమాటికి
యెక్కువ శ్రీవేంకటేశుఁ డెందుకైనా నవ్వు నవ్వీ
నిక్కము నే నియ్యకొంటి నిజము తెలుపరే
(||pallavi||)
verĕ ne nemi sesinā vĕṁgĕ mayyīni
porasi pŏrugu mīre buddi sĕpparammā
(||verĕ||)
daggari tanado nenu tagula nāḍidi nani
sigguvaḍi vunnavām̐ḍu sĕkkusedido
aggalamai ne mŏkkide naṁtagaṁṭĕm̐ dalavaṁchī
vĕggaḽamai mīrainā vem̐ḍugore sĕlulu
(||verĕ||)
ārasi yĕṁ duḍi vani yaḍiginamātramuna
mora paṁchu kunnām̐ḍu maunamudoḍa
sārĕ ne bujjagiṁchide ri nĕṁtainā nammam̐ḍu
ārideri nāmāru mī rānavĕṭṭugŏnare
(||verĕ||)
gakkana nem̐ danum̐ jūsi kām̐giliṁchugŏnnaṁdugu
makkuvado nannumĕchchī māḍimāḍigi
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍĕṁdugainā navvu navvī
nikkamu ne niyyagŏṁṭi nijamu tĕlubare