Veravudonimkaam joose visheshaalu

వెరవుతోనింకాఁ జూచే విశేషాలు
Language

(॥పల్లవి॥)
వెరవుతోనింకాఁ జూచే విశేషాలు
తెరమరఁ గెటువలెఁ దీసేవయ్యా

(॥వెర॥)
పలుసన్న లేమిటికి పనులేమి గలిగిన
తెలియనానతీరాదా తెలిసేను
నిలువు నూరు వండీ నీమేనిపచ్చిచేఁతలు
నలువంక నికనెట్టు నమ్మించేవయ్యా

(॥వెర॥)
వట్టిగుట్టులేమిటికి వలపింతగలిగిన
గట్టిగాఁ జూపవయ్యా కానిమ్మనేను
పుట్టెడు పోఁకకమ్మీ బొంకుల నీబాసలు
బట్టబయలెట్టు వొడఁబరచేవయ్యా

(॥వెర॥)
శిరసు వంచనేఁటికి సిగ్గులెంత కలిగినా
వొరసి కూడితివయ్య వొడఁబడేను
కురిసేఁ దేనెలు మోవికోరి శ్రీవేంకటేశుఁడ
తరవాతి రతినెట్టుఁ దనిపేవయ్యా

(||pallavi||)
vĕravudoniṁkām̐ jūse viśheṣhālu
tĕramaram̐ gĕḍuvalĕm̐ dīsevayyā

(||vĕra||)
palusanna lemiḍigi panulemi galigina
tĕliyanānadīrādā tĕlisenu
niluvu nūru vaṁḍī nīmenibachchisem̐talu
naluvaṁka niganĕṭṭu nammiṁchevayyā

(||vĕra||)
vaṭṭiguṭṭulemiḍigi valabiṁtagaligina
gaṭṭigām̐ jūbavayyā kānimmanenu
puṭṭĕḍu pom̐kagammī bŏṁkula nībāsalu
baṭṭabayalĕṭṭu vŏḍam̐barasevayyā

(||vĕra||)
śhirasu vaṁchanem̐ṭigi siggulĕṁta kaliginā
vŏrasi kūḍidivayya vŏḍam̐baḍenu
kurisem̐ denĕlu movigori śhrīveṁkaḍeśhum̐ḍa
taravādi radinĕṭṭum̐ danibevayyā