Veravu lerumguduvu vevega raavayya

వెరవు లెరుఁగుదువు వేవేగ రావయ్య
Language

(॥పల్లవి॥)
వెరవు లెరుఁగుదువు వేవేగ రావయ్య
ఇరవైన అప్పణ నీ కిచ్చెఁ గదవయ్యా

(॥వెర॥)
దప్పి గొంటి నంటాను తరుణి నీ కెమ్మోవి
కప్పురము మారుగాను కైకొన్నదట
చెప్పె నాకు నానవాలు చేరి నాతో పొందుసేసి
ఇప్పు డిట్టె నాకు జనవియ్యవయ్యా

(॥వెర॥)
చలిగొనీ నంటాను సకియ నీ పచ్చడము
నిలువు గప్పులు గప్పీ నీతా నట
యెలమి నీ కిక్కువగా యీమాటే చెప్పుమనె
వలపుల నన్నుఁగూడి వదలకువయ్యా

(॥వెర॥)
తాను నీవు నొక్కటంటా తరుణి శ్రీ వేంకటేశ
నానిన రతులఁ గూడి నవ్వెనట
ఆనెలఁత వావి చెప్పె అలమేలు మంగ నేను
పూని నన్నుఁ గూడితివి పొంతనా లీవయ్యా

(||pallavi||)
vĕravu lĕrum̐guduvu vevega rāvayya
iravaina appaṇa nī kichchĕm̐ gadavayyā

(||vĕra||)
dappi gŏṁṭi naṁṭānu taruṇi nī kĕmmovi
kappuramu mārugānu kaigŏnnadaḍa
sĕppĕ nāgu nānavālu seri nādo pŏṁdusesi
ippu ḍiṭṭĕ nāgu janaviyyavayyā

(||vĕra||)
saligŏnī naṁṭānu sagiya nī pachchaḍamu
niluvu gappulu gappī nīdā naḍa
yĕlami nī kikkuvagā yīmāḍe sĕppumanĕ
valabula nannum̐gūḍi vadalaguvayyā

(||vĕra||)
tānu nīvu nŏkkaḍaṁṭā taruṇi śhrī veṁkaḍeśha
nānina radulam̐ gūḍi navvĕnaḍa
ānĕlam̐ta vāvi sĕppĕ alamelu maṁga nenu
pūni nannum̐ gūḍidivi pŏṁtanā līvayyā