వెఱవకువే చెలియా విభుఁడు బత్తిగలఁడు
(॥పల్లవి॥)
వెఱవకువే చెలియా విభుఁడు బత్తిగలఁడు
యెఱుకతో నిన్ను నేలీ నివి యేమి సేసీనే
(॥వెఱ॥)
చందమామ పోలిక సకియ నీనెమ్మెము
చందనపు కొంగగాలి చాయ నీ వూర్పు
కందువ చిగురాకులగని మించుకెమ్మోవి
యెందుండినా నివి నిన్ను నేమిసేసీనే
(॥వెఱ॥)
జక్కవలతోడి యాడు చక్కని నీచనుఁగవ
చొక్కమైనతామరలజోడు కన్నులు
వక్కణించితే తీగెలవంటివి నీచేతులు
యిక్కువలంటి నిన్నివి యేమి సేసీనే
(॥వెఱ॥)
కోవిలపాట వంటిది కోమలవు నీయెలుఁగు
భావించఁ దుమ్మిదగుంపుబాగు నీకొప్పు
చేవదేర నిన్ను నిట్టె శ్రీవేంకటేశుఁడు గూడె
యేవేళా నివెల్లా నిన్ను నేమి సేసీనే
(||pallavi||)
vĕṟavaguve sĕliyā vibhum̐ḍu battigalam̐ḍu
yĕṟugado ninnu nelī nivi yemi sesīne
(||vĕṟa||)
saṁdamāma poliga sagiya nīnĕmmĕmu
saṁdanabu kŏṁgagāli sāya nī vūrbu
kaṁduva sigurāgulagani miṁchugĕmmovi
yĕṁduṁḍinā nivi ninnu nemisesīne
(||vĕṟa||)
jakkavaladoḍi yāḍu sakkani nīsanum̐gava
sŏkkamainadāmaralajoḍu kannulu
vakkaṇiṁchide tīgĕlavaṁṭivi nīsedulu
yikkuvalaṁṭi ninnivi yemi sesīne
(||vĕṟa||)
kovilabāḍa vaṁṭidi komalavu nīyĕlum̐gu
bhāviṁcham̐ dummidaguṁpubāgu nīgŏppu
sevadera ninnu niṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yeveḽā nivĕllā ninnu nemi sesīne