Veṟavaguve neevu velamdi veeni kivellaa

వెఱవకువే నీవు వెలఁది వీని కివెల్లా
Language

(॥పల్లవి॥)
వెఱవకువే నీవు వెలఁది వీని కివెల్లా
మెఱయ నొండొకటికి మిక్కిలి పొందే కదే

(॥వెఱ॥)
జలజాక్షి నీమొగమే చందురుఁడై యుండఁగాను
యెలమిఁ గలువబాణా తామరలై యుండఁగాను
తళుకు నీకన్నులే తామరలై యుండఁగాను
బలిమి తుమ్మిదలు నీపైఁ బంతము చూపీనా

(॥వెఱ॥)
యింతి నీ జవ్వనవన మిట్టె నీమై నుండఁగాను
చెంతఁ గోవిలేఁటికిఁ జిమ్మిరేఁచీనే
మంతనపు నీపిఱుఁదే మరురథమై యుండఁగా
రంతుల చిలుక లేమి రవ్వ సేసీనే

(॥వెఱ॥)
అందపుఁ జన్నులు కొండలై నీకు నుండఁగాను
మందానిలుఁడేల మారుకొనీనే
యిందు నిట్టె శ్రీవేంకటేశుఁడు నిన్నేలఁగాను
కందువఁ జిత్తజుఁ డిట్టె కాకు సేసీనా

(||pallavi||)
vĕṟavaguve nīvu vĕlam̐di vīni kivĕllā
mĕṟaya nŏṁḍŏgaḍigi mikkili pŏṁde kade

(||vĕṟa||)
jalajākṣhi nīmŏgame saṁdurum̐ḍai yuṁḍam̐gānu
yĕlamim̐ galuvabāṇā tāmaralai yuṁḍam̐gānu
taḽugu nīgannule tāmaralai yuṁḍam̐gānu
balimi tummidalu nībaim̐ baṁtamu sūbīnā

(||vĕṟa||)
yiṁti nī javvanavana miṭṭĕ nīmai nuṁḍam̐gānu
sĕṁtam̐ govilem̐ṭigim̐ jimmirem̐sīne
maṁtanabu nībiṟum̐de marurathamai yuṁḍam̐gā
raṁtula siluga lemi ravva sesīne

(||vĕṟa||)
aṁdabum̐ jannulu kŏṁḍalai nīgu nuṁḍam̐gānu
maṁdānilum̐ḍela mārugŏnīne
yiṁdu niṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu ninnelam̐gānu
kaṁduvam̐ jittajum̐ ḍiṭṭĕ kāgu sesīnā