వెఱవకువయ్య నిన్ను వేసరించను
(॥పల్లవి॥)
వెఱవకువయ్య నిన్ను వేసరించను
కఱకులాడఁగ నేను గబ్బిదాననా
(॥॥)
మోము చూడఁగా నీకు మొక్కితి నింతే కాని
కామించి యే పనులకుఁ గాదు సుమ్మీ
చేముంచి యాపె నీ చేయి పట్టు కుండఁగాను
వేమరు నే నాసపడ వెఱ్ఱిదాననా
(॥॥)
గక్కనఁ జేయి వేయఁగ కైదండ యిచ్చితిఁ గాని
లెక్కసేయ నంత పని లేదు సుమ్మీ
మక్కళించి మక్కళించి మాట లాపె యాడఁగాను
యిక్కడ నీ సేవ సేయ నెడ్డదాననా
(॥॥)
బడలి రాఁగా నీకు పాదము లొత్తితిఁ గాని
యెడసినందుకుఁ బంత మీయఁ జుమ్మీ
అడరి శ్రీ వేంకటేశ అట్టే నన్ను నేలితివి
కొడిమె లింకా నెంచ గొల్లదాననా.
(||pallavi||)
vĕṟavaguvayya ninnu vesariṁchanu
kaṟagulāḍam̐ga nenu gabbidānanā
(||||)
momu sūḍam̐gā nīgu mŏkkidi niṁte kāni
kāmiṁchi ye panulagum̐ gādu summī
semuṁchi yābĕ nī seyi paṭṭu kuṁḍam̐gānu
vemaru ne nāsabaḍa vĕṭridānanā
(||||)
gakkanam̐ jeyi veyam̐ga kaidaṁḍa yichchidim̐ gāni
lĕkkaseya naṁta pani ledu summī
makkaḽiṁchi makkaḽiṁchi māḍa lābĕ yāḍam̐gānu
yikkaḍa nī seva seya nĕḍḍadānanā
(||||)
baḍali rām̐gā nīgu pādamu lŏttidim̐ gāni
yĕḍasinaṁdugum̐ baṁta mīyam̐ jummī
aḍari śhrī veṁkaḍeśha aṭṭe nannu nelidivi
kŏḍimĕ liṁkā nĕṁcha gŏlladānanā.