Veṟavagumdee yimdugumgaa vishvahidumda nenu

వెఱవకుఁడీ యిందుకుఁగా విశ్వహితుఁడ నేను
Language

(॥పల్లవి॥)
వెఱవకుఁడీ యిందుకుఁగా విశ్వహితుఁడ నేను
అఱిముఱి నన్ను నమ్ముట మేలు హరిదాసుఁడ నేఁ గాన

(॥వెఱవ॥)
పరమపదనాథునే భావించి తపము సేసే
వొరులలోకము నే నడుగ వో సురలాల
ధరలో లక్ష్మీపతిదాసుఁడ నేనైతిఁ గాని
సిరులకై మిము వేసరించ చింతించకుఁడీ మీరు

(॥వెఱవ॥)
పరగ చక్రాయుధుని బంట నేనై తపము సేసే
వొరులఁ బీడించఁ గాదు వో సురలాల
గరుడవాహనుని కడు నుతియించేఁ గాని
తరలి భీతిల్లి యమృతము దాఁచుకోకుఁడీ మీరు

(॥వెఱవ॥)
ఆముకొని యజ్ఞ్వేరుఁ డని నేఁ బూజించేఁ గాని
మీమీ భాగము లడుగుట లేదు సుమీ సురలార
యేమఱక శ్రీవేంకటేశుని శరణము జొచ్చితి
కామించినట్లనే నన్నుకరుణించుఁడీ మీరు

(||pallavi||)
vĕṟavagum̐ḍī yiṁdugum̐gā viśhvahidum̐ḍa nenu
aṟimuṟi nannu nammuḍa melu haridāsum̐ḍa nem̐ gāna

(||vĕṟava||)
paramabadanāthune bhāviṁchi tabamu sese
vŏrulalogamu ne naḍuga vo suralāla
dharalo lakṣhmībadidāsum̐ḍa nenaidim̐ gāni
sirulagai mimu vesariṁcha siṁtiṁchagum̐ḍī mīru

(||vĕṟava||)
paraga sakrāyudhuni baṁṭa nenai tabamu sese
vŏrulam̐ bīḍiṁcham̐ gādu vo suralāla
garuḍavāhanuni kaḍu nudiyiṁchem̐ gāni
tarali bhīdilli yamṛtamu dām̐sugogum̐ḍī mīru

(||vĕṟava||)
āmugŏni yajñverum̐ ḍani nem̐ būjiṁchem̐ gāni
mīmī bhāgamu laḍuguḍa ledu sumī suralāra
yemaṟaga śhrīveṁkaḍeśhuni śharaṇamu jŏchchidi
kāmiṁchinaṭlane nannugaruṇiṁchum̐ḍī mīru