Veṟavagu seppavayyaa venaga vesugonenu

వెఱవకు చెప్పవయ్యా వెనక వేసుకొనేను
Language

(॥పల్లవి॥)
వెఱవకు చెప్పవయ్యా వెనక వేసుకొనేను
పఱచుఁ జేఁతల వో పండరంగివిట్టలా

(॥వెఱవకు॥)
పీలిపాగవన్నెలవి ప్రేమపు నీ కామినుల
కాలిగోరిలత్తుకలు గమ్మినటువలె నుండే
మూలల నీ వేటికైనా మొక్కితివో వారిచూపు
కోలుముందై నీవు రాఁగా కోలలై తగిలెను

(॥వెఱవకు॥)
మెడని తులసిదండ మెలఁతల కోరికలు
పొడమి చిగురులై పొందినటువలె నుండె
అడరి వారితనువు లచ్చుగా ధరించితివో
కడు నిన్నుఁ జెనకేటి కరపల్లవములో

(॥వెఱవకు॥)
కట్టిన పీతాంబరము కామినుల కుంకు మెల్లా
అట్టే అద్ది నవన్నె లైనటువలె నుండె
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అట్టే వారివలపో నా యనురాగమో

(||pallavi||)
vĕṟavagu sĕppavayyā vĕnaga vesugŏnenu
paṟasum̐ jem̐tala vo paṁḍaraṁgiviṭṭalā

(||vĕṟavagu||)
pīlibāgavannĕlavi premabu nī kāminula
kāligorilattugalu gamminaḍuvalĕ nuṁḍe
mūlala nī veḍigainā mŏkkidivo vārisūbu
kolumuṁdai nīvu rām̐gā kolalai tagilĕnu

(||vĕṟavagu||)
mĕḍani tulasidaṁḍa mĕlam̐tala korigalu
pŏḍami sigurulai pŏṁdinaḍuvalĕ nuṁḍĕ
aḍari vāridanuvu lachchugā dhariṁchidivo
kaḍu ninnum̐ jĕnageḍi karaballavamulo

(||vĕṟavagu||)
kaṭṭina pīdāṁbaramu kāminula kuṁku mĕllā
aṭṭe addi navannĕ lainaḍuvalĕ nuṁḍĕ
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
aṭṭe vārivalabo nā yanurāgamo