Veṟavagu ninnu namta vesarimchanu

వెఱవకు నిన్ను నంత వేసరించను
Language

(॥పల్లవి॥)
వెఱవకు నిన్ను నంత వేసరించను
నెఱి నీగుణములు నే నెఱఁగనా

(॥వెఱవకు॥)
చనవు సేసుక నే నీసరుసఁ గూచుంటిఁ గాక
ననుపు చెప్పుక నీతో నవ్వ వచ్చేనా
వెనకటివాఁడవా నీవిధము నే నెఱఁగనా
చెనిక నీతో నేరమి సేసుకొనేనా

(॥వెఱవకు॥)
కపట మెఱఁగనా కతలు చెప్పితిఁ గాక
నెపమున వావులు నే నీకుఁ జెప్పేనా
కపురుమొకదాకిరి గడించ నీకు వచ్చునా
యిపు డిట్టె నీకు దా యెస పెట్టేనా

(॥వెఱవకు॥)
కైవసము గాఁగా నిన్నుఁ గాఁగిట నించితిఁ గాక
భావ మెఱఁగక నిన్నుఁ బైకొనేనా
శ్రీవెంకటేశుఁడ నే మెచ్చి తలమేలుమంగను
నీవే నే నని కాక నీక మొక్కేనా

(||pallavi||)
vĕṟavagu ninnu naṁta vesariṁchanu
nĕṟi nīguṇamulu ne nĕṟam̐ganā

(||vĕṟavagu||)
sanavu sesuga ne nīsarusam̐ gūsuṁṭim̐ gāga
nanubu sĕppuga nīdo navva vachchenā
vĕnagaḍivām̐ḍavā nīvidhamu ne nĕṟam̐ganā
sĕniga nīdo nerami sesugŏnenā

(||vĕṟavagu||)
kabaḍa mĕṟam̐ganā kadalu sĕppidim̐ gāga
nĕbamuna vāvulu ne nīgum̐ jĕppenā
kaburumŏgadāgiri gaḍiṁcha nīgu vachchunā
yibu ḍiṭṭĕ nīgu dā yĕsa pĕṭṭenā

(||vĕṟavagu||)
kaivasamu gām̐gā ninnum̐ gām̐giḍa niṁchidim̐ gāga
bhāva mĕṟam̐gaga ninnum̐ baigŏnenā
śhrīvĕṁkaḍeśhum̐ḍa ne mĕchchi talamelumaṁganu
nīve ne nani kāga nīga mŏkkenā