వెఱవకు నేఁ గూడి వెస నందుకూ నంపేను
(॥పల్లవి॥)
వెఱవకు నేఁ గూడి వెస నందుకూ నంపేను
తఱి నాకు మొగమోడింతలో వెరగందేవు
(॥॥)
యెవ్వతెకో ఆడ వీడె మిచ్చి వచ్చి నన్నుఁ గని
అవ్వలఁ బోరాక వుపాయాలు చూచేవు
నవ్వుచు నీ కొంగువట్టి నాయింటికిఁ దీసి తేను
వువ్విళ్ళూర దిగులుతో నుస్సురనేవు
(॥॥)
విందాపెకుఁ జెప్పి వచ్చి వెస నీడ నన్నుఁ గని
అంది కొంపోరాక వుపాలు చూచేవు
సందడి నే మాటలాడి జరపులఁ బెట్టితేను
పొందుగఁ జల్లారీ నంటా పొద్దులు చూచేవు
(॥॥)
వొంటి నాకెఁ బెట్టి వచ్చి వొద్దికతో నన్నుఁ గని
అంటి పాయరాక వుపాయాలు చూచేవు
జంటయి శ్రీవేంకటేశ సమరతిఁ జొక్కించితే
పెంటగా నిందుంటి నంటా బిమ్మిటి గొనేవు
(||pallavi||)
vĕṟavagu nem̐ gūḍi vĕsa naṁdugū naṁpenu
taṟi nāgu mŏgamoḍiṁtalo vĕragaṁdevu
(||||)
yĕvvadĕgo āḍa vīḍĕ michchi vachchi nannum̐ gani
avvalam̐ borāga vubāyālu sūsevu
navvusu nī kŏṁguvaṭṭi nāyiṁṭigim̐ dīsi tenu
vuvviḽḽūra diguludo nussuranevu
(||||)
viṁdābĕgum̐ jĕppi vachchi vĕsa nīḍa nannum̐ gani
aṁdi kŏṁporāga vubālu sūsevu
saṁdaḍi ne māḍalāḍi jarabulam̐ bĕṭṭidenu
pŏṁdugam̐ jallārī naṁṭā pŏddulu sūsevu
(||||)
vŏṁṭi nāgĕm̐ bĕṭṭi vachchi vŏddigado nannum̐ gani
aṁṭi pāyarāga vubāyālu sūsevu
jaṁṭayi śhrīveṁkaḍeśha samaradim̐ jŏkkiṁchide
pĕṁṭagā niṁduṁṭi naṁṭā bimmiḍi gŏnevu