Veragubadi soosee vibhumdu ni nnamduge

వెరగుపడి చూచీ విభుఁడు ని న్నందుకే
Language

(॥పల్లవి॥)
వెరగుపడి చూచీ విభుఁడు ని న్నందుకే
అరసి నీ వలపు అందరిపైఁ బూతురా

(॥మోరగు॥)
నిగ్గుల నీ రమణుఁడు నిన్ను నటు దిట్టితేను
యెగ్గులు వేరొకతెపై నేల పెట్టేవే
వొగ్గుచు ని న్నాతఁడు వొడివట్టి తీసితేను
బగ్గన నాపెకొంగు పట్టించే వదేమే

(॥మోరగు॥)
తమకించి ని న్నాతఁడు తప్పక చూచితే నేఁడు
రమణినిఁ దెచ్చి ముందరనుఁ దోసేవే
సముకాన కొనగోర నాకె నొత్తవచ్చితేను
అమర వేరొకతె మే నటు దాఁకించేవే

(॥మోరగు॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడితేను
వావిరి నాపెకు నేల వంతువెట్టేవే
నీ వలమేల్మంగవు ని న్నుర మెక్కించుకొంటే
భూవనితఁ దెచ్చి యట్టె భుజ మెక్కించేవే

(||pallavi||)
vĕragubaḍi sūsī vibhum̐ḍu ni nnaṁduge
arasi nī valabu aṁdaribaim̐ būdurā

(||moragu||)
niggula nī ramaṇum̐ḍu ninnu naḍu diṭṭidenu
yĕggulu verŏgadĕbai nela pĕṭṭeve
vŏggusu ni nnādam̐ḍu vŏḍivaṭṭi tīsidenu
baggana nābĕgŏṁgu paṭṭiṁche vademe

(||moragu||)
tamagiṁchi ni nnādam̐ḍu tappaga sūside nem̐ḍu
ramaṇinim̐ dĕchchi muṁdaranum̐ doseve
samugāna kŏnagora nāgĕ nŏttavachchidenu
amara verŏgadĕ me naḍu dām̐kiṁcheve

(||moragu||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri ninnum̐ gūḍidenu
vāviri nābĕgu nela vaṁtuvĕṭṭeve
nī valamelmaṁgavu ni nnura mĕkkiṁchugŏṁṭe
bhūvanidam̐ dĕchchi yaṭṭĕ bhuja mĕkkiṁcheve