Veṟage managu vedamamku danagu

వెఱగే మనకు వెడమంకు దనకు
Language

(॥పల్లవి॥)
వెఱగే మనకు వెడమంకు దనకు
యెఱుకా మఱపునాయ నేమిసేతమే

(॥వెఱ॥)
చిత్తజుఁ డొక్కఁ డెఱుఁడు శివుఁడోఁక్కఁడే యెఱుఁగు
ఇత్తలఁ జెలియమనసెట్టుగనేమే
మొత్తపుమోనముతోడ మొక్కినా నూరకున్నది
హత్తి తరవాతిమాట లవి యేమాడుదమే

(॥వెఱ॥)
ఱట్టుఁ గోవి లెఱుంగు మీఱఁగ రాముఁడే యెఱుఁగు
ఇట్టె యీ చెలిపలు కెట్టు వినేమే
గుట్టువిడిచి నవ్వినా గుణము చెప్పకున్నది
కట్టఁగడపటఁ బతి కన్న దేకానుపే

(॥వెఱ॥)
చందురుఁ డోక్కఁ డెఱుఁగు సరిఁ జకోర మెఱుఁగు
పొంది చేరి మోముకళ పొగడేదెట్టే
అందపు శ్రీవేంకటేశుఁ డండకే విచ్చేసి కూడె
ఇందరముఁ జెలిసిగ్గు లెట్టు వెళ్లవేతమే

(||pallavi||)
vĕṟage managu vĕḍamaṁku danagu
yĕṟugā maṟabunāya nemisedame

(||vĕṟa||)
sittajum̐ ḍŏkkam̐ ḍĕṟum̐ḍu śhivum̐ḍom̐kkam̐ḍe yĕṟum̐gu
ittalam̐ jĕliyamanasĕṭṭuganeme
mŏttabumonamudoḍa mŏkkinā nūragunnadi
hatti taravādimāḍa lavi yemāḍudame

(||vĕṟa||)
ṟaṭṭum̐ govi lĕṟuṁgu mīṟam̐ga rāmum̐ḍe yĕṟum̐gu
iṭṭĕ yī sĕlibalu kĕṭṭu vineme
guṭṭuviḍisi navvinā guṇamu sĕppagunnadi
kaṭṭam̐gaḍabaḍam̐ badi kanna degānube

(||vĕṟa||)
saṁdurum̐ ḍokkam̐ ḍĕṟum̐gu sarim̐ jagora mĕṟum̐gu
pŏṁdi seri momugaḽa pŏgaḍedĕṭṭe
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁḍage vichchesi kūḍĕ
iṁdaramum̐ jĕlisiggu lĕṭṭu vĕḽlavedame