Veragayyee neebe sese vesaalagu

వెరగయ్యీ నీపె సేసే వేసాలకు
Language

(॥పల్లవి॥)
వెరగయ్యీ నీపె సేసే వేసాలకు
యిరవైన నీచిత్త మిఁక నెట్టోకాని

(॥వెర॥)
వాసులకే పెనఁగీని వంతులకే చెనకీని
వేసరదెంతైనా నీతో వేడుకలను
ఆసలనే కెరలీని అందాలకే లాచీని
చేసూటి నీకె యెంత చేఁతలాఁడోకాని

(॥వెర॥)
చూపులనే సొలసీని చుట్టి చుట్టి మలసీని
వోపననదు నీతోడి వొరపులను
తీపులుగా మాఁటలాడి తేనెలు మోవిఁ జూపి
కాఁపురాల కీపె యెంత కతకారో కాని

(॥వెర॥)
చనువులకే వచ్చీ సరసములకే పొంచీ
తనియదు నిన్నుఁ గూడే తలపోఁతల
యెనసితివి శ్రీవేంకటేశ యింతలో నన్ను
ననుపుల కీకె యెంత నయగారోకాని

(||pallavi||)
vĕragayyī nībĕ sese vesālagu
yiravaina nīsitta mim̐ka nĕṭṭogāni

(||vĕra||)
vāsulage pĕnam̐gīni vaṁtulage sĕnagīni
vesaradĕṁtainā nīdo veḍugalanu
āsalane kĕralīni aṁdālage lāsīni
sesūḍi nīgĕ yĕṁta sem̐talām̐ḍogāni

(||vĕra||)
sūbulane sŏlasīni suṭṭi suṭṭi malasīni
vobananadu nīdoḍi vŏrabulanu
tībulugā mām̐ṭalāḍi tenĕlu movim̐ jūbi
kām̐purāla kībĕ yĕṁta kadagāro kāni

(||vĕra||)
sanuvulage vachchī sarasamulage pŏṁchī
taniyadu ninnum̐ gūḍe talabom̐tala
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁtalo nannu
nanubula kīgĕ yĕṁta nayagārogāni