వెఱతుమయ్యా నీకు వింత లింకానేమైనా
(॥పల్లవి॥)
వెఱతుమయ్యా నీకు వింత లింకానేమైనా
మఱి నిన్ను నెప్పుడుఁ గమ్మరా విడువరా
(॥॥)
పిలివ వచ్చినసతి పెదవులెల్లాఁ బొక్కె
వెలయ నీపే రెంతవేఁడోకాని
చలువకు మందులేక సాదించ నే వచ్చితిరా
పలుకకుండితే మోవి పతిపొక్కింపింతురా
(॥॥)
చూడవచ్చినట్టి ఇంతి చూపులెల్లాఁ గెంపువారె
జాడ నీరూ పెంతటిబాసటమో కాని
వేడుక నిది మానుప వేఁడికో నే వచ్చితిరా
తోడనే నీ పూరకున్న తుదమీరఁ జేతురా
(॥॥)
ఆకుమడిచిచ్చే సతియంగ మెల్లాఁ జెమరించె
చేకొని నీవేమిచేఁత సేసితోకాని
దాకొని శ్రీ వేంకటేశ దగ్గరి నేఁ గూడుండఁగా
నాకన్నీఁ జెప్పకుండితే నవ్వు నవ్వింపింతురా
(||pallavi||)
vĕṟadumayyā nīgu viṁta liṁkānemainā
maṟi ninnu nĕppuḍum̐ gammarā viḍuvarā
(||||)
piliva vachchinasadi pĕdavulĕllām̐ bŏkkĕ
vĕlaya nībe rĕṁtavem̐ḍogāni
saluvagu maṁdulega sādiṁcha ne vachchidirā
palugaguṁḍide movi padibŏkkiṁpiṁturā
(||||)
sūḍavachchinaṭṭi iṁti sūbulĕllām̐ gĕṁpuvārĕ
jāḍa nīrū pĕṁtaḍibāsaḍamo kāni
veḍuga nidi mānuba vem̐ḍigo ne vachchidirā
toḍane nī pūragunna tudamīram̐ jedurā
(||||)
āgumaḍisichche sadiyaṁga mĕllām̐ jĕmariṁchĕ
segŏni nīvemisem̐ta sesidogāni
dāgŏni śhrī veṁkaḍeśha daggari nem̐ gūḍuṁḍam̐gā
nāgannīm̐ jĕppaguṁḍide navvu navviṁpiṁturā