వెఱపేల రమ్మనవే వింతవాఁడా తా నాకు
(॥పల్లవి॥)
వెఱపేల రమ్మనవే వింతవాఁడా తా నాకు
మెఱుఁగు మెరిచితేను మించదా దిక్కులను
(॥వెఱ॥)
అందుకేమె తా నన్ను నాదరించె నింతలోనే
యెందఱిఁ గూడివచ్చినా నేమాయనే
ముందు నన్నుఁగూడెను ముడిచివేసినపువ్వు
పొందుగా వీదినుండితే బుగంధించకుండునా
(॥వెఱ॥)
కడమ యేదే తాను కైకొని నన్ను మెచ్చె
యెడసి యెందుండినాను యేమాయనే
కడఁగి నాతో నవ్వె గరచివేసినబూరె
అడరి యెక్కడఁగన్నా నట్టె నోరురదా
(॥వెఱ॥)
ఇన్నీ నేలె శ్రీవేంకటేశుఁ డిట్టె నన్ను నేలె
యెన్నిపెండ్లిండ్లాడినా నేమాయనే
వున్నాఁడు నాకాఁగిటను వొద్దికైననాకంచము
కన్నవారెల్లాఁ బొత్తుగలయక వుందురా
(||pallavi||)
vĕṟabela rammanave viṁtavām̐ḍā tā nāgu
mĕṟum̐gu mĕrisidenu miṁchadā dikkulanu
(||vĕṟa||)
aṁdugemĕ tā nannu nādariṁchĕ niṁtalone
yĕṁdaṟim̐ gūḍivachchinā nemāyane
muṁdu nannum̐gūḍĕnu muḍisivesinabuvvu
pŏṁdugā vīdinuṁḍide bugaṁdhiṁchaguṁḍunā
(||vĕṟa||)
kaḍama yede tānu kaigŏni nannu mĕchchĕ
yĕḍasi yĕṁduṁḍinānu yemāyane
kaḍam̐gi nādo navvĕ garasivesinabūrĕ
aḍari yĕkkaḍam̐gannā naṭṭĕ noruradā
(||vĕṟa||)
innī nelĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannu nelĕ
yĕnnibĕṁḍliṁḍlāḍinā nemāyane
vunnām̐ḍu nāgām̐giḍanu vŏddigainanāgaṁchamu
kannavārĕllām̐ bŏttugalayaga vuṁdurā