Veraa naagu neegu vimtadaananaa

వేరా నాకు నీకు వింతదాననా
Language

(॥పల్లవి॥)
వేరా నాకు నీకు వింతదాననా
సారె సారెకును నిన్ను సంతోషింతుఁ గాక

(॥వేరా॥)
బలిమి నీవు నన్నుఁ బచ్చి యెంతసేసినాను
చలము సాదించేనా జంకించేనా
నెలకొన్న విభుఁడవు నీకు నూడిగపు దాన
చలివాసి నీగుణాలు సారె మెత్తుఁగాక

(॥వేరా॥)
సతినంటా నీవు నాతో జాణతనా లాడితేను
పతి మాటలాడేనా బాస గొనేనా
మితిమీరి నీకు నే మేనరికమైనదాన
యితవై నీ సుద్దులెల్లా నియ్యకొందుఁగాక

(॥వేరా॥)
సిగ్గుదీర నీవు నాపై చేతు లెంత చాఁచినాను
వెగ్గళించేనా మరి వేసరేనా
యెగ్గులేక శ్రీ వేంకటేశ నీ కూటమిదాన
నిగ్గుల నీతోఁ జనవు నెరపుదుఁగాక

(||pallavi||)
verā nāgu nīgu viṁtadānanā
sārĕ sārĕgunu ninnu saṁtoṣhiṁtum̐ gāga

(||verā||)
balimi nīvu nannum̐ bachchi yĕṁtasesinānu
salamu sādiṁchenā jaṁkiṁchenā
nĕlagŏnna vibhum̐ḍavu nīgu nūḍigabu dāna
salivāsi nīguṇālu sārĕ mĕttum̐gāga

(||verā||)
sadinaṁṭā nīvu nādo jāṇadanā lāḍidenu
padi māḍalāḍenā bāsa gŏnenā
midimīri nīgu ne menarigamainadāna
yidavai nī suddulĕllā niyyagŏṁdum̐gāga

(||verā||)
siggudīra nīvu nābai sedu lĕṁta sām̐sinānu
vĕggaḽiṁchenā mari vesarenā
yĕggulega śhrī veṁkaḍeśha nī kūḍamidāna
niggula nīdom̐ janavu nĕrabudum̐gāga