వెన్నెలఁ గాయఁగాను వేసవందురా
(॥పల్లవి॥)
వెన్నెలఁ గాయఁగాను వేసవందురా
మన్ననలు చేకొని నెమ్మది నుండఁగదవే
(॥వెన్నె॥)
పగటున నాతఁడు పకపక నవ్వఁగాను
యెగసక్కేలెల్లా నీవే యేలాడేవే
తగినట్టెల్లా నప్పటిఁ దగవులు నెరపఁగ
నిగిడ నీ వింతలోనే నింద వేతురా
(॥వెన్నె॥)
పొదిగి నీ శిరసున పువ్వుల ముడువఁగాను
గుదిగొని నీ వతని గోర గీరేవే
వెదకి యతఁడు నీ వెంట వెంటఁదిరుగఁగా
పదిలాన మంచముపైఁ బవ్వళింతురా
(॥వెన్నె॥)
శ్రీవేంకటేశుఁడు నిన్ను జేరి కాఁగిలించుకోఁగా
చేవమీరి వేల సిగ్గు పడేవే
భావించి పెక్కురతులఁ బచారించి కూడినాడు
తావుల నీ నేర్పు చూపి తమకింతురా
(||pallavi||)
vĕnnĕlam̐ gāyam̐gānu vesavaṁdurā
mannanalu segŏni nĕmmadi nuṁḍam̐gadave
(||vĕnnĕ||)
pagaḍuna nādam̐ḍu pagabaga navvam̐gānu
yĕgasakkelĕllā nīve yelāḍeve
taginaṭṭĕllā nappaḍim̐ dagavulu nĕrabam̐ga
nigiḍa nī viṁtalone niṁda vedurā
(||vĕnnĕ||)
pŏdigi nī śhirasuna puvvula muḍuvam̐gānu
gudigŏni nī vadani gora gīreve
vĕdagi yadam̐ḍu nī vĕṁṭa vĕṁṭam̐dirugam̐gā
padilāna maṁchamubaim̐ bavvaḽiṁturā
(||vĕnnĕ||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnu jeri kām̐giliṁchugom̐gā
sevamīri vela siggu paḍeve
bhāviṁchi pĕkkuradulam̐ basāriṁchi kūḍināḍu
tāvula nī nerbu sūbi tamagiṁturā