వెన్నెలలు గడు వేఁడి విరులు వాఁడి
(॥పల్లవి॥)
వెన్నెలలు గడు వేఁడి విరులు వాఁడి
యెన్నరావు తలపోఁత లెట్టోరిచేనే
(॥వెన్నెల॥)
కాతరాన సన్నచేసి కప్పురాన నన్నువేసి
చేతికి లోనైతి నంటాఁ జేరి నవ్వీనే
ఱాతిగుండెతోఁ దనకు ఱట్టోకటే దక్కీఁగాక
యీతల నేనాఁటదాన నెట్టోరిచేనే
(॥వెన్నెల॥)
సందడిలోఁ గాలుదొక్కి సగము మాటలు గుక్కి
పొందులెల్లా దక్కెనంటాఁ బూఁచి తిట్టీనే
అందగాఁడు గన తనకాడినదీడేరెఁ గాక
యిందరిలోఁ బిన్నదాన నెట్టోరిచేనే
(॥వెన్నెల॥)
కతలనే వావిచెప్పి కడుఁబచ్చడము గప్పి
సతమైతినంటా నన్నుసారెఁ గూడీనే
తతి శ్రీవేంకటేశుఁడు తన యిచ్చలాయఁ గాక
యితవరి గోలదాన నెట్టోరిచేనే
(||pallavi||)
vĕnnĕlalu gaḍu vem̐ḍi virulu vām̐ḍi
yĕnnarāvu talabom̐ta lĕṭṭorisene
(||vĕnnĕla||)
kādarāna sannasesi kappurāna nannuvesi
sedigi lonaidi naṁṭām̐ jeri navvīne
ṟādiguṁḍĕdom̐ danagu ṟaṭṭogaḍe dakkīm̐gāga
yīdala nenām̐ṭadāna nĕṭṭorisene
(||vĕnnĕla||)
saṁdaḍilom̐ gāludŏkki sagamu māḍalu gukki
pŏṁdulĕllā dakkĕnaṁṭām̐ būm̐si tiṭṭīne
aṁdagām̐ḍu gana tanagāḍinadīḍerĕm̐ gāga
yiṁdarilom̐ binnadāna nĕṭṭorisene
(||vĕnnĕla||)
kadalane vāvisĕppi kaḍum̐bachchaḍamu gappi
sadamaidinaṁṭā nannusārĕm̐ gūḍīne
tadi śhrīveṁkaḍeśhum̐ḍu tana yichchalāyam̐ gāga
yidavari goladāna nĕṭṭorisene