Vennavattuga neyi vedaganelaa mariyu

వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు
Language

(॥పల్లవి॥)
వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు-
నెన్ని వలసినను దమయేలెటివే కావా

(॥వెన్న॥)
తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు
కలుగుటే కలుగువలెఁగాక
వలనైన భోగములు వైభవంబులు మరియు
కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా

(॥వెన్న॥)
పదిలముగ హరినామపఠన మంత్రము నోరు
కదియుటే కలుగవలెఁగాక
తుదలేని సంపదలు తొలగని ముదంబులును
కదలకెప్పుడుఁ దమకు గలిగినవె కావా

(॥వెన్న॥)
యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబు
కాంచుటే కలుగవలెఁగాక
అంచితంబైన నిత్యానంద పదవులను
మించి తమయెదుటఁ బ్రభనించినవె కావా

(||pallavi||)
vĕnnavaṭṭuga neyi vĕdaganelā mariyu-
nĕnni valasinanu damayelĕḍive kāvā

(||vĕnna||)
talam̐punagu viṣhṇusiṁtana nimiṣhamātraṁbu
kaluguḍe kaluguvalĕm̐gāga
valanaina bhogamulu vaibhavaṁbulu mariyu
kalavĕlla tamayĕduḍam̐ galiginavĕ kāvā

(||vĕnna||)
padilamuga harināmabaṭhana maṁtramu noru
kadiyuḍe kalugavalĕm̐gāga
tudaleni saṁpadalu tŏlagani mudaṁbulunu
kadalagĕppuḍum̐ damagu galiginavĕ kāvā

(||vĕnna||)
yiṁchugainanu veṁkaḍeśhu giriśhikharaṁbu
kāṁchuḍe kalugavalĕm̐gāga
aṁchidaṁbaina nityānaṁda padavulanu
miṁchi tamayĕduḍam̐ brabhaniṁchinavĕ kāvā