Vennalu selavim gaare viththaleshaa

వెన్నలు సెలవిఁ గారే విఠ్ఠలేశా
Language

(॥పల్లవి॥)
వెన్నలు సెలవిఁ గారే విఠ్ఠలేశా
నన్ను చూచి నవ్వేవు నాలి విఠ్ఠలేశా

(॥వెన్నలు॥)
బాలులతో నాడి యాడి బడిలితివి రావయ్య
వేలెటికురుల ముద్దువిఠ్ఠలేశా
కాళింగుఁ దొక్కితి వట కటకట వుద్దండాలు
వోలిఁ జేయ దొరకొంటి వోవిఠ్ఠలేశా

(॥వెన్నలు॥)
దూడలవెంటఁ దిరిగి దూళి మేన నంటె నిదే
వేడుక యంతో నీకు విఠ్ఠలేశా
యేడకొండో వొకవేల నెత్తితివి నీ వట
వోడక యింత సేతురా వోవిఠ్ఠలేశా

(॥వెన్నలు॥)
గొల్లెతల నంటి యంటి గొల్లు మేన నిండె నిదే
వెల్లవి రాయఁ బనులు విఠ్ఠలేశా
యిల్లిదె పండరంగిని యిటు శ్రీవెంకటాద్రిని
వుల్ల మలరు నిలిచి తోవిఠ్ఠలేశా

(||pallavi||)
vĕnnalu sĕlavim̐ gāre viṭhṭhaleśhā
nannu sūsi navvevu nāli viṭhṭhaleśhā

(||vĕnnalu||)
bālulado nāḍi yāḍi baḍilidivi rāvayya
velĕḍigurula mudduviṭhṭhaleśhā
kāḽiṁgum̐ dŏkkidi vaḍa kaḍagaḍa vuddaṁḍālu
volim̐ jeya dŏragŏṁṭi voviṭhṭhaleśhā

(||vĕnnalu||)
dūḍalavĕṁṭam̐ dirigi dūḽi mena naṁṭĕ nide
veḍuga yaṁto nīgu viṭhṭhaleśhā
yeḍagŏṁḍo vŏgavela nĕttidivi nī vaḍa
voḍaga yiṁta sedurā voviṭhṭhaleśhā

(||vĕnnalu||)
gŏllĕdala naṁṭi yaṁṭi gŏllu mena niṁḍĕ nide
vĕllavi rāyam̐ banulu viṭhṭhaleśhā
yillidĕ paṁḍaraṁgini yiḍu śhrīvĕṁkaḍādrini
vulla malaru nilisi toviṭhṭhaleśhā