వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు
(॥పల్లవి॥)
వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు
విన్న కన్న జాడ గాదు వెఱ్ఱివా నీవు
(॥వెన్నలు॥)
మీఱి యజ్ఞానంబున మిమ్మెుల్లని జీవుల
వీఱిడివై మోచేవు వెఱ్ఱివా నీవు
వేఱే నారపేరు నుడివితే నీ పేరనీవు
వేఱులేని చుట్టమవై వెఱ్ఱివా నీవు
(॥వెన్నలు॥)
బంటులైన వారికెల్లాఁ బరతంత్రుఁడవై
వెంట వెంటఁ దిరిగేవు వెఱ్ఱివా నీవు
అంటి రెండు కుచేలుని యడుకులకే మెచ్చేవు
వింటే మాకు నవ్వు వచ్చీ వెఱ్ఱివా నీవు
(॥వెన్నలు॥)
పావనమై లోకులెల్లా బదుకుఁడంటాఁ బేరులు
వేవేలు వెట్టుకొంటివి వెఱ్ఱివా నీవు
శ్రీ వేంకటేశుఁడవై చేరి వరము లిచ్చేవు
వేవేగ నెవ్వరికైనా వెఱ్ఱివా నీవు
(||pallavi||)
vĕnnalu dŏṁgilunāḍi vĕṭrivā nīvu
vinna kanna jāḍa gādu vĕṭrivā nīvu
(||vĕnnalu||)
mīṟi yajñānaṁbuna mimmĕుllani jīvula
vīṟiḍivai mosevu vĕṭrivā nīvu
veṟe nāraberu nuḍivide nī peranīvu
veṟuleni suṭṭamavai vĕṭrivā nīvu
(||vĕnnalu||)
baṁṭulaina vārigĕllām̐ baradaṁtrum̐ḍavai
vĕṁṭa vĕṁṭam̐ dirigevu vĕṭrivā nīvu
aṁṭi rĕṁḍu kuseluni yaḍugulage mĕchchevu
viṁṭe māgu navvu vachchī vĕṭrivā nīvu
(||vĕnnalu||)
pāvanamai logulĕllā badugum̐ḍaṁṭām̐ berulu
vevelu vĕṭṭugŏṁṭivi vĕṭrivā nīvu
śhrī veṁkaḍeśhum̐ḍavai seri varamu lichchevu
vevega nĕvvarigainā vĕṭrivā nīvu