వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు
(॥పల్లవి॥)
వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు
విన్నకన్నజాడ గాదు వెఱ్ఱివా నీవు
(॥వెన్న॥)
చేరి నిన్నునొల్లనట్టిజీవుల నీవుదరాన
వీరుఁడవై మోఁచేవు వెఱ్ఱివా నీవు
నారపేరు నుడిగితే నా పేరంటాఁ దగిలేవు
వీరానఁ జుట్టమవై వెఱ్ఱివా నీవు
(॥వెన్న॥)
బంటులైనవారికిఁ బరతంత్రుఁడవై యీ-
వెంటవెంట దిరిగేవు వెఱ్ఱివా నీవు
అంటే ననరాదు రెండుఅడుకులకే చొచ్చేవు
వింటే మాకు నవ్వువచ్చీ వెఱ్ఱివా నీవు
(॥వెన్న॥)
పావనులయి లోకమెల్లా బదుకుమంటాఁ బేళ్లు
వేవేలు వెట్టుకొంటివి వెఱ్ఱివా నీవు
శ్రీవేంకటేశుఁడవై చెంది వరము లిచ్చేవు
వేవేగ నెవ్వరికైనా వెఱ్ఱివా నీవు
(||pallavi||)
vĕnnalu dŏṁgilunāḍi vĕṭrivā nīvu
vinnagannajāḍa gādu vĕṭrivā nīvu
(||vĕnna||)
seri ninnunŏllanaṭṭijīvula nīvudarāna
vīrum̐ḍavai mom̐sevu vĕṭrivā nīvu
nāraberu nuḍigide nā peraṁṭām̐ dagilevu
vīrānam̐ juṭṭamavai vĕṭrivā nīvu
(||vĕnna||)
baṁṭulainavārigim̐ baradaṁtrum̐ḍavai yī-
vĕṁṭavĕṁṭa dirigevu vĕṭrivā nīvu
aṁṭe nanarādu rĕṁḍuaḍugulage sŏchchevu
viṁṭe māgu navvuvachchī vĕṭrivā nīvu
(||vĕnna||)
pāvanulayi logamĕllā badugumaṁṭām̐ beḽlu
vevelu vĕṭṭugŏṁṭivi vĕṭrivā nīvu
śhrīveṁkaḍeśhum̐ḍavai sĕṁdi varamu lichchevu
vevega nĕvvarigainā vĕṭrivā nīvu