వెన్నతోఁ బెట్టిరి నీకు వేసాలెల్లాను
(॥పల్లవి॥)
వెన్నతోఁ బెట్టిరి నీకు వేసాలెల్లాను
పిన్ననాఁడే గొల్లెతలు పెక్కుచందములను
(॥॥)
వన్నెగా సతులనెల్ల వలపించ నేరుతువు
విన్నపములు చేసితే విన నేర్తువు
సన్నల మోవితేనెలు చవిచూప నేరుతువు
మిన్నక మమ్మెల్లను నమ్మించ నేరవా
(॥॥)
చుట్టిరికములు చేసి చొక్కించ నోపుదువు
గట్టిగా రతుల బెనఁగ నోపుదువు
జట్టిగొని నవ్వు నవ్వి చనవియ్య నొపుదువు
మట్టుమీరి మమ్ము నిన్ను మరిగించ నోపవా
(॥॥)
ప్రియముతోడుతను కాఁపిరము సేయఁగలవు
భయమెల్లఁ దీరిచి చేపట్టఁ గలవు
నియతి శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి
జయమాయ మాపట్టుకు జవదాఁటఁగలవా
(||pallavi||)
vĕnnadom̐ bĕṭṭiri nīgu vesālĕllānu
pinnanām̐ḍe gŏllĕdalu pĕkkusaṁdamulanu
(||||)
vannĕgā sadulanĕlla valabiṁcha neruduvu
vinnabamulu seside vina nerduvu
sannala movidenĕlu savisūba neruduvu
minnaga mammĕllanu nammiṁcha neravā
(||||)
suṭṭirigamulu sesi sŏkkiṁcha nobuduvu
gaṭṭigā radula bĕnam̐ga nobuduvu
jaṭṭigŏni navvu navvi sanaviyya nŏbuduvu
maṭṭumīri mammu ninnu marigiṁcha nobavā
(||||)
priyamudoḍudanu kām̐piramu seyam̐galavu
bhayamĕllam̐ dīrisi sebaṭṭam̐ galavu
niyadi śhrīveṁkaḍeśha nīvu mammu nelidivi
jayamāya mābaṭṭugu javadām̐ṭam̐galavā