Venna pattugoni neyi vedaganela

వెన్న పట్టుకొని నేయి వెదకనేల
Language

(॥పల్లవి॥)
వెన్న పట్టుకొని నేయి వెదకనేల
కన్నప్పుడే రమణునిఁ గాఁగిలించుకొనవే

(॥వెన్న॥)
మంతనము లాడియాడి మరి యెడమాటలేల
చెంత నొక్క టైనమీఁద సిగ్గులేలా
సంతోసమైనవెనక సారె విచారములేల
కాంతరో విభుని మెచ్చి కాఁగిలించుకొనవే

(॥వెన్న॥)
కన్నులఁ జూచి పతి చక్కఁ దనా లడుగనేల
ఇన్నియు నేరిచి బయలీఁదనేల
మన్ననలు చేకొని మఱఁగున దాఁగనేల
కన్నెవైతేనే మితనిఁ గాఁగిలించుకొనవే

(॥వెన్న॥)
ననుపు లొనగూడితే మనసు సోదించనేల
తనిసి యాసాసలు దప్పఁగనేల
యెనసె శ్రీవేంకటేశుఁడింతలొనె నిన్ను మెచ్చి
ఘనుఁ డీతని నేపొద్దూ గాఁగిలించుకొనవే

(||pallavi||)
vĕnna paṭṭugŏni neyi vĕdaganela
kannappuḍe ramaṇunim̐ gām̐giliṁchugŏnave

(||vĕnna||)
maṁtanamu lāḍiyāḍi mari yĕḍamāḍalela
sĕṁta nŏkka ṭainamīm̐da siggulelā
saṁtosamainavĕnaga sārĕ visāramulela
kāṁtaro vibhuni mĕchchi kām̐giliṁchugŏnave

(||vĕnna||)
kannulam̐ jūsi padi sakkam̐ danā laḍuganela
inniyu nerisi bayalīm̐danela
mannanalu segŏni maṟam̐guna dām̐ganela
kannĕvaidene midanim̐ gām̐giliṁchugŏnave

(||vĕnna||)
nanubu lŏnagūḍide manasu sodiṁchanela
tanisi yāsāsalu dappam̐ganela
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ḍiṁtalŏnĕ ninnu mĕchchi
ghanum̐ ḍīdani nebŏddū gām̐giliṁchugŏnave