వెనకఁ జేతువుగాని వినోదాలన్నియును
(॥పల్లవి॥)
వెనకఁ జేతువుగాని వినోదాలన్నియును
తనివోక నీ మొగము తప్పక చూచీని
(॥॥)
ఇందమని బాగాలు నీకిచ్చీ దోసిట నాపె
బెందడి రెండు చన్నులుఁ బిక్కిటిల్లఁగా
కందువ నీకబ్బెనంటాఁ గడుఁ బిసికే వంతలో
అందుకోవయ్యా వీడె మట్టే పట్టుకున్నది
(॥॥)
సారెకు మన్నించుమని సాగిలి మొక్కీ నీకు
గారవపుఁ బిరుదులు గదలఁగాను
గోరనంటి సిగ్గులకు గొబ్బునఁ జాఁచేవు చేయి
ఆరీతి నీవెత్తవయ్య అట్టే పండి వున్నది
(॥॥)
ఆలనైతి నని నిన్ను నట్టే కాఁగిలించుకొనీ
జాలువారే చెమటలు జారఁగాను
బేలవై శ్రీవేంకటేశ పెదవి తేనెలానేవు
వోలివెట్టవయ్య అట్టే వురమెక్కుకున్నది.
(||pallavi||)
vĕnagam̐ jeduvugāni vinodālanniyunu
tanivoga nī mŏgamu tappaga sūsīni
(||||)
iṁdamani bāgālu nīgichchī dosiḍa nābĕ
bĕṁdaḍi rĕṁḍu sannulum̐ bikkiḍillam̐gā
kaṁduva nīgabbĕnaṁṭām̐ gaḍum̐ bisige vaṁtalo
aṁdugovayyā vīḍĕ maṭṭe paṭṭugunnadi
(||||)
sārĕgu manniṁchumani sāgili mŏkkī nīgu
gāravabum̐ birudulu gadalam̐gānu
goranaṁṭi siggulagu gŏbbunam̐ jām̐sevu seyi
ārīdi nīvĕttavayya aṭṭe paṁḍi vunnadi
(||||)
ālanaidi nani ninnu naṭṭe kām̐giliṁchugŏnī
jāluvāre sĕmaḍalu jāram̐gānu
belavai śhrīveṁkaḍeśha pĕdavi tenĕlānevu
volivĕṭṭavayya aṭṭe vuramĕkkugunnadi.