వెనకఁ జేతువుగాని వేసాలప్రియములెల్లా
(॥పల్లవి॥)
వెనకఁ జేతువుగాని వేసాలప్రియములెల్లా
కనుసన్న సేయకుమి కావి గానవచ్చీని
(॥వెనక॥)
కుంగి యంత మొక్కకుమీ కొప్పుపూలటు రాలీ
కొంగుజార వేఁడుకొకు గురి గానవచ్చీవి
చెంగట చేయివేయకు చెమటలు రాగిదేరీ
వుగిటి యెదురు రాకు వూర్పులు రేఁగీని
(॥వెనక॥)
పలువినయములు చెప్పకు మోవిబయలయ్యీ
వెలయ విసరకు నీవింతతావి వచ్చీవి
కలసి పెనఁగకుము గందాలు చిట్లీని
అలవిమీరఁ బొగడ కలపుఁదోచీని
(॥వెనక॥)
ఆకుమడిచియ్యరాకు ఆకెవుంగరాలే మించీ
యేకతమాడనే రాకు యేచ్చినకళలు దోఁచీ
పై కొని శ్రీవేంకటేశ బలిమి నన్నుఁ గడితి
యేకతము సేయకు మంత యెచ్చుకొందయ్యీని
(||pallavi||)
vĕnagam̐ jeduvugāni vesālapriyamulĕllā
kanusanna seyagumi kāvi gānavachchīni
(||vĕnaga||)
kuṁgi yaṁta mŏkkagumī kŏppubūlaḍu rālī
kŏṁgujāra vem̐ḍugŏgu guri gānavachchīvi
sĕṁgaḍa seyiveyagu sĕmaḍalu rāgiderī
vugiḍi yĕduru rāgu vūrbulu rem̐gīni
(||vĕnaga||)
paluvinayamulu sĕppagu movibayalayyī
vĕlaya visaragu nīviṁtadāvi vachchīvi
kalasi pĕnam̐gagumu gaṁdālu siṭlīni
alavimīram̐ bŏgaḍa kalabum̐dosīni
(||vĕnaga||)
āgumaḍisiyyarāgu āgĕvuṁgarāle miṁchī
yegadamāḍane rāgu yechchinagaḽalu dom̐sī
pai kŏni śhrīveṁkaḍeśha balimi nannum̐ gaḍidi
yegadamu seyagu maṁta yĕchchugŏṁdayyīni