Venagadivale nimka vesarenaa needo

వెనకటివలె నిఁక వేసరేనా నీతో
Language

(॥పల్లవి॥)
వెనకటివలె నిఁక వేసరేనా నీతో
అనువుగా నీ చెప్పినట్లు సేసేమయ్యా

(॥వెన॥)
మానినులఅలుకలు మాటలాడుదాఁకానే
నానినచలములెల్లా నవ్వుదాఁకానే
యేనెపము లేదు మమ్ము నెంతేసి వేఁడుకొనేవు
ఆనుకొని నీచెప్పినట్లు సేసేమయ్యా

(॥వెన॥)
సిగ్గులు గక్కన నీవు చేయి చాఁచినందాఁకానే
యెగ్గులు మంతనమున నెనయుదాఁక
వొగ్గుచు మమ్మిందుకుఁగా వూరడించే వింతేసి
అగ్గలము నీచెప్పినట్టు సేసేమయ్యా

(॥వెన॥)
కడమ లేమిగల్లానుకన్నుల జూచుదాఁకానే
జడియుటెట్లా మేలుచల్లుదాఁకానే
కడిఁగి శ్రీవేంకటేశ కలసితి వింతేసి
అడరి నీవు చెప్పినట్టే సేసేమయ్యా

(||pallavi||)
vĕnagaḍivalĕ nim̐ka vesarenā nīdo
anuvugā nī sĕppinaṭlu sesemayyā

(||vĕna||)
māninulaalugalu māḍalāḍudām̐kāne
nāninasalamulĕllā navvudām̐kāne
yenĕbamu ledu mammu nĕṁtesi vem̐ḍugŏnevu
ānugŏni nīsĕppinaṭlu sesemayyā

(||vĕna||)
siggulu gakkana nīvu seyi sām̐sinaṁdām̐kāne
yĕggulu maṁtanamuna nĕnayudām̐ka
vŏggusu mammiṁdugum̐gā vūraḍiṁche viṁtesi
aggalamu nīsĕppinaṭṭu sesemayyā

(||vĕna||)
kaḍama lemigallānugannula jūsudām̐kāne
jaḍiyuḍĕṭlā melusalludām̐kāne
kaḍim̐gi śhrīveṁkaḍeśha kalasidi viṁtesi
aḍari nīvu sĕppinaṭṭe sesemayyā