వెనకటివలె నేను వెరతు వెరతునిఁక
(॥పల్లవి॥)
వెనకటివలె నేను వెరతు వెరతునిఁక
తనవానివలెనుండి దాయఁ గూడీనా
(॥వెనక॥)
కలువపువ్వులబంతి కానుకలేలంపీనే
కలువలు మరునంపగము లోయమ్మా
తలఁచి తనకుఁ గానే తాపమున నున్న నన్ను
వెలినుండి యిదికొంత వెతలు రేఁచీనా
(॥వెనక॥)
యిట్టె యీవనములోనికేల రప్పించీనోయమ్మ
కట్టిడి వసంతపు కాలమిది
యిట్లైన తనరాకకు యెదురు చూచే నన్ను
కట్టఁగడ తానుండి కాఁకలఁ బెట్టీనా
(॥వెనక॥)
చిలుకలతెర యేల చేరి కట్టించె నడుమఁ
జిలుకలు వాతరొట్లు చిమ్మిరేఁచును
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో విచ్చేసి కూడి
పలురతులనే యింక భ్రమలఁ బెట్టీనా
(||pallavi||)
vĕnagaḍivalĕ nenu vĕradu vĕradunim̐ka
tanavānivalĕnuṁḍi dāyam̐ gūḍīnā
(||vĕnaga||)
kaluvabuvvulabaṁti kānugalelaṁpīne
kaluvalu marunaṁpagamu loyammā
talam̐si tanagum̐ gāne tābamuna nunna nannu
vĕlinuṁḍi yidigŏṁta vĕdalu rem̐sīnā
(||vĕnaga||)
yiṭṭĕ yīvanamulonigela rappiṁchīnoyamma
kaṭṭiḍi vasaṁtabu kālamidi
yiṭlaina tanarāgagu yĕduru sūse nannu
kaṭṭam̐gaḍa tānuṁḍi kām̐kalam̐ bĕṭṭīnā
(||vĕnaga||)
silugaladĕra yela seri kaṭṭiṁchĕ naḍumam̐
jilugalu vādarŏṭlu simmirem̐sunu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍi
paluradulane yiṁka bhramalam̐ bĕṭṭīnā