Venagadi neramulu veyainaam dadavanu

వెనకటి నేరములు వేయైనాఁ దడవను
Language

(॥పల్లవి॥)
వెనకటి నేరములు వేయైనాఁ దడవను
మనసొక్కటిగా బుద్దిమంతుఁడైతేఁ జాలును

(॥వెన॥)
యేఁటికింకా మాటలుయేమని దూరేము నేము
గాఁటపుఁదనకరుణ కలంతే చాలు
కూటమికి రమ్మనవే గుట్టుతోనే వుండేను
మాఁటులేనితాను బుద్దిమంతుఁడై తేఁ జాలును

(॥వెన॥)
కాఁతరించఁబనిలేదు గద్దించ నోపను
చేతికిలోనై మన్నించినదే చాలు
తే తెమ్మనవే విడెము తిరమైతి నన్నిటాను
మాతలఁపువలె బుద్దిమంతుఁడైతేఁ జాలును

(॥వెన॥)
చెక్కు లెంతవడి నొక్కె సిగ్గు లెందాఁకా నెరపె
ఇక్కు వంటి ననుఁగూడె నిదె చాలు
దక్కె శ్రీవేంకటేశుఁడు తానే నాకిన్నిటాను
మక్కున నింతట బుద్దిమంతుఁడై తేఁ జాలును

(||pallavi||)
vĕnagaḍi neramulu veyainām̐ daḍavanu
manasŏkkaḍigā buddimaṁtum̐ḍaidem̐ jālunu

(||vĕna||)
yem̐ṭigiṁkā māḍaluyemani dūremu nemu
gām̐ṭabum̐danagaruṇa kalaṁte sālu
kūḍamigi rammanave guṭṭudone vuṁḍenu
mām̐ṭulenidānu buddimaṁtum̐ḍai tem̐ jālunu

(||vĕna||)
kām̐tariṁcham̐baniledu gaddiṁcha nobanu
sedigilonai manniṁchinade sālu
te tĕmmanave viḍĕmu tiramaidi nanniḍānu
mādalam̐puvalĕ buddimaṁtum̐ḍaidem̐ jālunu

(||vĕna||)
sĕkku lĕṁtavaḍi nŏkkĕ siggu lĕṁdām̐kā nĕrabĕ
ikku vaṁṭi nanum̐gūḍĕ nidĕ sālu
dakkĕ śhrīveṁkaḍeśhum̐ḍu tāne nāginniḍānu
makkuna niṁtaḍa buddimaṁtum̐ḍai tem̐ jālunu