Venaga tiyyanemtigi vesaaramga nemtigi

వెనక తియ్యనేఁటికి వేసారఁగ నేఁటికి
Language

(॥పల్లవి॥)
వెనక తియ్యనేఁటికి వేసారఁగ నేఁటికి
పెనఁగఁగవద్దా నీకుఁ బ్రియమైనదాఁకాను

(॥వెన॥)
పనివడి నీవు నాతో పచారించి చెప్పఁగాను
వినవద్దా నీమాటలు వేడుకతోను
కనుఁగొని నీవు నాతో కాఁపురము సేయఁగా
కొనియాడవద్దా నిన్ను కోరిక లీడేరను

(॥వెన॥)
మంతనాన నీవు నామనసురా మెలఁగఁగా
సంతోసించవద్దా నిన్ను సారెసారెకు
చింతదీర నీవు నాకు చేతికి లోనై వుండఁగా
ఇంత బత్తి సేయవద్దా ఇంపులు మీరఁగను

(॥వెన॥)
తగవు దప్పక నీవే దయతోడ నేలఁగాను
తగఁ గాఁగిలించవద్దా తమితోడను
మగిడి శ్రీవేంకటేశ మన్నించి నన్నుఁ గూడఁగా
పొగడఁగవద్దా నిన్ను బూమెల్లా నెఱఁగను

(||pallavi||)
vĕnaga tiyyanem̐ṭigi vesāram̐ga nem̐ṭigi
pĕnam̐gam̐gavaddā nīgum̐ briyamainadām̐kānu

(||vĕna||)
panivaḍi nīvu nādo pasāriṁchi sĕppam̐gānu
vinavaddā nīmāḍalu veḍugadonu
kanum̐gŏni nīvu nādo kām̐puramu seyam̐gā
kŏniyāḍavaddā ninnu koriga līḍeranu

(||vĕna||)
maṁtanāna nīvu nāmanasurā mĕlam̐gam̐gā
saṁtosiṁchavaddā ninnu sārĕsārĕgu
siṁtadīra nīvu nāgu sedigi lonai vuṁḍam̐gā
iṁta batti seyavaddā iṁpulu mīram̐ganu

(||vĕna||)
tagavu dappaga nīve dayadoḍa nelam̐gānu
tagam̐ gām̐giliṁchavaddā tamidoḍanu
magiḍi śhrīveṁkaḍeśha manniṁchi nannum̐ gūḍam̐gā
pŏgaḍam̐gavaddā ninnu būmĕllā nĕṟam̐ganu