Venaga neegu mokki vemdugoneemgaani seli

వెనక నీకు మొక్కి వేఁడుకొనీఁగాని చెలి
Language

(॥పల్లవి॥)
వెనక నీకు మొక్కి వేఁడుకొనీఁగాని చెలి
మునుపఁ బంతములాడి మొఱయకువయ్యా

(॥వెన॥)
యెనసివుండినచోట నేమాఁటైనా నాడుదురు
పెనఁగులాడేవేళ బిగుతురు
పనులు సేయఁగాను పాదములు చెయి సోఁకు
వనితల నెగ్గుపట్టవలదయ్య నీవు

(॥వెన॥)
తప్పకచూచితేను తరితీపులెల్లా రేఁగు
కుప్పవడ నవ్వఁగాను కొప్ప వీడును
కప్పురము చవిగొంటే కడునెంగిలి యంటును
అప్పుడే యింతుల జరయఁగఁ దగవుగాదు

(॥వెన॥)
వేడుకమాట లాడితే వెంగెములైతోఁచును
కూడేపానుపుపైని సిగ్గులు జారును
యీడనె శ్రీవేంకటేశ యేలితి నీపె నింతలో
జాడతో సతి నలయించకువయ్య యిఁకను

(||pallavi||)
vĕnaga nīgu mŏkki vem̐ḍugŏnīm̐gāni sĕli
munubam̐ baṁtamulāḍi mŏṟayaguvayyā

(||vĕna||)
yĕnasivuṁḍinasoḍa nemām̐ṭainā nāḍuduru
pĕnam̐gulāḍeveḽa biguduru
panulu seyam̐gānu pādamulu sĕyi som̐ku
vanidala nĕggubaṭṭavaladayya nīvu

(||vĕna||)
tappagasūsidenu taridībulĕllā rem̐gu
kuppavaḍa navvam̐gānu kŏppa vīḍunu
kappuramu savigŏṁṭe kaḍunĕṁgili yaṁṭunu
appuḍe yiṁtula jarayam̐gam̐ dagavugādu

(||vĕna||)
veḍugamāḍa lāḍide vĕṁgĕmulaidom̐sunu
kūḍebānububaini siggulu jārunu
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidi nībĕ niṁtalo
jāḍado sadi nalayiṁchaguvayya yim̐kanu