Venaga nappadi doori vesarimcha nenoba

వెనక నప్పటి దూరి వేసరించ నేనోప
Language

(॥పల్లవి॥)
వెనక నప్పటి దూరి వేసరించ నేనోప
యెనసి బిగిసితేను యేమి సేతునే

(॥వెనక॥)
యీతనిమాటలే రాకాసింతులను బ్రమయించె
యీతల నింకా మరియెట్టు నమ్మేదే
నీతితో వంకలొత్తుచు నీవు నన్నొడఁబరచేఁ
వేతులకు సమ్మతించి యేమి సేతునే

(॥వెనక॥)
తనపొందులే గొల్లెతలను వలలఁ బెట్టె
కనియు నింకా నెట్టు కానిమ్మందునే
చెనకి చక్కట్లుగాఁ జేసి నన్నుఁ గూడించేవు
యెనలేక తగిలి మరేమి సేతునే

(॥వెనక॥)
నంటున శ్రీవేంకటేశు నవ్వు శ్రీసతిఁ జొక్కించె
అంటి కూడితి నింకా నెట్టౌఁ గాదందునే
జంట చవులు వుట్టించి చనవు లిప్పించితివి
ఇంటనే సంతోసమిచ్చె నేమి సేతునే

(||pallavi||)
vĕnaga nappaḍi dūri vesariṁcha nenoba
yĕnasi bigisidenu yemi sedune

(||vĕnaga||)
yīdanimāḍale rāgāsiṁtulanu bramayiṁchĕ
yīdala niṁkā mariyĕṭṭu nammede
nīdido vaṁkalŏttusu nīvu nannŏḍam̐barasem̐
vedulagu sammadiṁchi yemi sedune

(||vĕnaga||)
tanabŏṁdule gŏllĕdalanu valalam̐ bĕṭṭĕ
kaniyu niṁkā nĕṭṭu kānimmaṁdune
sĕnagi sakkaṭlugām̐ jesi nannum̐ gūḍiṁchevu
yĕnalega tagili maremi sedune

(||vĕnaga||)
naṁṭuna śhrīveṁkaḍeśhu navvu śhrīsadim̐ jŏkkiṁchĕ
aṁṭi kūḍidi niṁkā nĕṭṭaum̐ gādaṁdune
jaṁṭa savulu vuṭṭiṁchi sanavu lippiṁchidivi
iṁṭane saṁtosamichchĕ nemi sedune