Venaga mum demchambode veduga nee gunamulu

వెనక ముం దెంచఁబోతే వేడుక నీ గుణములు
Language

(॥పల్లవి॥)
వెనక ముం దెంచఁబోతే వేడుక నీ గుణములు
మనసంతే మంగళము మంతనాలు వలెనా

(॥వెనక॥)
చెప్పఁగానే తనిసితి చేసి చూపవలెనా
కప్పురపునోటఁ గులుకకురా మాట
కుప్పలాయఁ బులకలు గు ట్లింకా వలెనా
కొప్పున పువ్వులు రాలీఁ గొసరకురా మోహము

(॥వెనక॥)
చూచినట్టే తనిసితి సూడుఁబాడువలెనా
లాచినకన్నులనే చల్లకురా నవ్వు
వాచవు లాయ నొట్లు వాసు లింకా వలెనా
యేచి వాఁగేఁగంకణము లెంచ నింకా నెమ్మెలు

(॥వెనక॥)
కూడినట్టే తనిసితి గోరితాఁ కువలెనా
జాడతో మిక్కిలి పెంచకురా సిగ్గు
యీడనే శ్రీవేంకటేశ యింతలోనే కూడితివి
వేడుకెల్లా జెల్లె నిదె వీడకురా కౌఁగిలి

(||pallavi||)
vĕnaga muṁ dĕṁcham̐bode veḍuga nī guṇamulu
manasaṁte maṁgaḽamu maṁtanālu valĕnā

(||vĕnaga||)
sĕppam̐gāne tanisidi sesi sūbavalĕnā
kappurabunoḍam̐ gulugagurā māḍa
kuppalāyam̐ bulagalu gu ṭliṁkā valĕnā
kŏppuna puvvulu rālīm̐ gŏsaragurā mohamu

(||vĕnaga||)
sūsinaṭṭe tanisidi sūḍum̐bāḍuvalĕnā
lāsinagannulane sallagurā navvu
vāsavu lāya nŏṭlu vāsu liṁkā valĕnā
yesi vām̐gem̐gaṁkaṇamu lĕṁcha niṁkā nĕmmĕlu

(||vĕnaga||)
kūḍinaṭṭe tanisidi goridām̐ kuvalĕnā
jāḍado mikkili pĕṁchagurā siggu
yīḍane śhrīveṁkaḍeśha yiṁtalone kūḍidivi
veḍugĕllā jĕllĕ nidĕ vīḍagurā kaum̐gili