వెనక మమ్మన వద్దు వెతలఁ బొరల వద్దు
(॥పల్లవి॥)
వెనక మమ్మన వద్దు వెతలఁ బొరల వద్దు
అనుమాన మెల్లఁ దీరె నరసుకోవమ్మా
(॥వెనక॥)
తలఁచఁగానె వచ్చె తరుణి నీరమణుఁడు
అలరి మీమచ్చటలు ఆడుకోరమ్మా
నిలుచున్నాఁ డదివో నీయెదుట నతఁడు
తెలియఁగల వెల్లాను తెలుసుకోవమ్మా
(॥వెనక॥)
చేతికి లో నై యున్నాఁడు చిల్లరచేఁతలు మేన
ఘాతలుగ లేవు గదా కనుకోవమ్మా
యేతుల నీ చెప్పినట్టు యేమి సేయు మన్నాఁ జేసీ
యీతల నొరసి చూడు మింకా నోయమ్మా
(॥వెనక॥)
గక్కనఁ బ్రేమ మెరిఁగి కాఁగిలించినాఁ డిదివో
మిక్కిలి శ్రీవెంకటేశు మెచ్చవమ్మా
నిక్కి యీతనిగుణాలు నీ వెరఁగ వలసితే
చెక్కు నొక్కి బుజ్జగించి చిత్తగించవమ్మా
(||pallavi||)
vĕnaga mammana vaddu vĕdalam̐ bŏrala vaddu
anumāna mĕllam̐ dīrĕ narasugovammā
(||vĕnaga||)
talam̐sam̐gānĕ vachchĕ taruṇi nīramaṇum̐ḍu
alari mīmachchaḍalu āḍugorammā
nilusunnām̐ ḍadivo nīyĕduḍa nadam̐ḍu
tĕliyam̐gala vĕllānu tĕlusugovammā
(||vĕnaga||)
sedigi lo nai yunnām̐ḍu sillarasem̐talu mena
ghādaluga levu gadā kanugovammā
yedula nī sĕppinaṭṭu yemi seyu mannām̐ jesī
yīdala nŏrasi sūḍu miṁkā noyammā
(||vĕnaga||)
gakkanam̐ brema mĕrim̐gi kām̐giliṁchinām̐ ḍidivo
mikkili śhrīvĕṁkaḍeśhu mĕchchavammā
nikki yīdaniguṇālu nī vĕram̐ga valaside
sĕkku nŏkki bujjagiṁchi sittagiṁchavammā