వేఁటలాడి వచ్చేనంటా వేసాలు సేసేవు మాతో
(॥పల్లవి॥)
వేఁటలాడి వచ్చేనంటా వేసాలు సేసేవు మాతో-
నేఁటికి నిదెట్టు నీకు యితవాయనయ్యా
(॥వేట॥)
జొబ్బిలినజవ్వాది జొటజొట వడియఁగ
నిబ్బరపుఁ దేనెకంపు నిగుడఁగాను
గుబ్బలపై పేరులగురిగింజ లొత్తఁగాను
గబ్బిచెంచెతల నెట్టు కాఁగిలింతువయ్యా
(॥వేట॥)
పుప్పొడి మైనిండ రాలి పొదిగొని వుండఁగాను
కప్పురమే తిని మోవి గాజుగట్టఁగా
కప్పినపారిటాకులు కళబెళమనఁగాను
చప్పిడిచెంచెతలతో సంగతెట్లాయనయ్యా
(॥వేట॥)
తలపై మొల్లవిరుల కలులు మూఁగుకరాఁగా
చిలుకబాసలు సెలవుల రేఁగఁగా
అలమేల్మంగను నన్నుఁ నలమి శ్రీవేంకటేశ
పెలుచుఁజెంచెతలలోఁ బెనఁగుటెట్లయ్యా
(||pallavi||)
vem̐ṭalāḍi vachchenaṁṭā vesālu sesevu mādo-
nem̐ṭigi nidĕṭṭu nīgu yidavāyanayyā
(||veḍa||)
jŏbbilinajavvādi jŏḍajŏḍa vaḍiyam̐ga
nibbarabum̐ denĕgaṁpu niguḍam̐gānu
gubbalabai perulagurigiṁja lŏttam̐gānu
gabbisĕṁchĕdala nĕṭṭu kām̐giliṁtuvayyā
(||veḍa||)
puppŏḍi mainiṁḍa rāli pŏdigŏni vuṁḍam̐gānu
kappurame tini movi gājugaṭṭam̐gā
kappinabāriḍāgulu kaḽabĕḽamanam̐gānu
sappiḍisĕṁchĕdalado saṁgadĕṭlāyanayyā
(||veḍa||)
talabai mŏllavirula kalulu mūm̐gugarām̐gā
silugabāsalu sĕlavula rem̐gam̐gā
alamelmaṁganu nannum̐ nalami śhrīveṁkaḍeśha
pĕlusum̐jĕṁchĕdalalom̐ bĕnam̐guḍĕṭlayyā