Vemgiramaa konadiruvemgalesha | nimdem

వేఁగిరమా కోనతిరువెంగళేశ । నిండెఁ
Language

(॥పల్లవి॥)
వేఁగిరమా కోనతిరువెంగళేశ । నిండెఁ
దేగపు వలపు కోనతిరువెంగళేశ

(॥వేఁగి॥)
కాయమెల్లఁ బులకించె గక్కన నీచేయి నాపై
వేయఁగానే కోనతిరువేంగళేశ
బాయిటనే ఇదె నా గుబ్బలపై పయ్యదకొంగు
తీయకుమీ యంత కోనతిరువెంగళేశ

(॥వేఁగి॥)
కొల్లున నీవు నవ్వితే కొప్పువిరులు పైరాలె
వెల్లవిరిఁ గోనతిరువెంగళేశ
చెల్లెనీకు నామేనఁ జేసినచేఁతలు తేట
తెల్లమాయ నిదె కోనతిరువెంగళేశ

(॥వేఁగి॥)
భావించి కూడితి విట్టె పంతములు వచ్చె మాకు
వేవేలుఁ గోనతిరువెంగళేశ
శ్రీవేంకటాద్రి మీఁద చిత్తమెల్లో గంటి నిదె
దేవుఁడ విన్నిటాఁ గోనతిరువెంగళేశ

(||pallavi||)
vem̐giramā konadiruvĕṁgaḽeśha | niṁḍĕm̐
degabu valabu konadiruvĕṁgaḽeśha

(||vem̐gi||)
kāyamĕllam̐ bulagiṁchĕ gakkana nīseyi nābai
veyam̐gāne konadiruveṁgaḽeśha
bāyiḍane idĕ nā gubbalabai payyadagŏṁgu
tīyagumī yaṁta konadiruvĕṁgaḽeśha

(||vem̐gi||)
kŏlluna nīvu navvide kŏppuvirulu pairālĕ
vĕllavirim̐ gonadiruvĕṁgaḽeśha
sĕllĕnīgu nāmenam̐ jesinasem̐talu teḍa
tĕllamāya nidĕ konadiruvĕṁgaḽeśha

(||vem̐gi||)
bhāviṁchi kūḍidi viṭṭĕ paṁtamulu vachchĕ māgu
vevelum̐ gonadiruvĕṁgaḽeśha
śhrīveṁkaḍādri mīm̐da sittamĕllo gaṁṭi nidĕ
devum̐ḍa vinniḍām̐ gonadiruvĕṁgaḽeśha