వెంగెములు నిన్నాడను వేసరించను
(॥పల్లవి॥)
వెంగెములు నిన్నాడను వేసరించను
సంగతిగ నీకు నిచ్చకమే సేసేను
(॥॥)
తలపోఁత లెన్ని లేవు తమకము లెన్ని లేవు
వలచినయటువంటివనితకును
కలువల వేసి నన్నుఁ గమ్ముక యెంతడిగేవు
నెలకొన్ననీచేఁతలు నీవెరఁగవా
(॥॥)
వాడుమోవైతే నేమి వంచినతలైతే నేమి
వోడక విరహముతో నున్న దానికి
యీడకు వచ్చితివిగా యిప్పుడు వేఁడుకోనేల
వేడుకకాఁడవు నీకు వెలితున్నదా
(॥॥)
నివ్వెరగులు గడమా నిండునవ్వులు గడమా
వువ్విళ్లూర నిన్నుఁగూడి వున్ననాకును
యివ్వల శ్రీ వేంకటేశ యెంత నన్ను లాలించేవు
నివ్వుటిల్లు నేర్పరివి నీకు నేఁడు గొత్తలా
(||pallavi||)
vĕṁgĕmulu ninnāḍanu vesariṁchanu
saṁgadiga nīgu nichchagame sesenu
(||||)
talabom̐ta lĕnni levu tamagamu lĕnni levu
valasinayaḍuvaṁṭivanidagunu
kaluvala vesi nannum̐ gammuga yĕṁtaḍigevu
nĕlagŏnnanīsem̐talu nīvĕram̐gavā
(||||)
vāḍumovaide nemi vaṁchinadalaide nemi
voḍaga virahamudo nunna dānigi
yīḍagu vachchidivigā yippuḍu vem̐ḍugonela
veḍugagām̐ḍavu nīgu vĕlidunnadā
(||||)
nivvĕragulu gaḍamā niṁḍunavvulu gaḍamā
vuvviḽlūra ninnum̐gūḍi vunnanāgunu
yivvala śhrī veṁkaḍeśha yĕṁta nannu lāliṁchevu
nivvuḍillu nerbarivi nīgu nem̐ḍu gŏttalā