వెంగెము లాడకురే విభునితోను
(॥పల్లవి॥)
వెంగెము లాడకురే విభునితోను
సంగతితో నతని కిచ్చకురాల నేను
(॥వెంగె॥)
అద్దమరేతిరికాడ నాతఁ డింటికి విచ్చేసె
గద్దెపీఁట వెట్టరే కాంతలాల
వొద్దికతో మాటలాడనోపుఁ గడునేరుపరి
సుద్దులెల్లా నడుగరే చుట్టపు వరుసను
(॥వెంగె॥)
అలసినచెమటతో నదె నిలుచున్నవాఁడు
జెలకము వట్టరే సతులాల
నెలకొన్న కన్నులను నిద్దురదేరిఁ దనకు
లలిఁ బానుపు వరచి లాలించరే
(॥వెంగె॥)
అందు నిందుఁ దిరిగాడి ఆఁకలిగొన్నాఁడేమో
విందువెట్టరే పతికి వెలఁదులాల
చెంచె నన్ను నింతలోనె శ్రీవేంకటోశుఁడితఁడు
పొందు లిందరికిఁ జేసీఁ బొగడరే మీరు
(||pallavi||)
vĕṁgĕmu lāḍagure vibhunidonu
saṁgadido nadani kichchagurāla nenu
(||vĕṁgĕ||)
addamaredirigāḍa nādam̐ ḍiṁṭigi vichchesĕ
gaddĕbīm̐ṭa vĕṭṭare kāṁtalāla
vŏddigado māḍalāḍanobum̐ gaḍunerubari
suddulĕllā naḍugare suṭṭabu varusanu
(||vĕṁgĕ||)
alasinasĕmaḍado nadĕ nilusunnavām̐ḍu
jĕlagamu vaṭṭare sadulāla
nĕlagŏnna kannulanu nidduraderim̐ danagu
lalim̐ bānubu varasi lāliṁchare
(||vĕṁgĕ||)
aṁdu niṁdum̐ dirigāḍi ām̐kaligŏnnām̐ḍemo
viṁduvĕṭṭare padigi vĕlam̐dulāla
sĕṁchĕ nannu niṁtalonĕ śhrīveṁkaḍośhum̐ḍidam̐ḍu
pŏṁdu liṁdarigim̐ jesīm̐ bŏgaḍare mīru